Maa Inti Bangaram Trailer: టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత (Samantha) తన హోమ్ బ్యానర్ 'ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్' (Tralala Moving Pictures)పై ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తూ, నటిస్తున్న సరికొత్త చిత్రం 'మా ఇంటి బంగారం'.
గతంలో సమంత, టాలెంటెడ్ డైరెక్టర్ నందిని రెడ్డి కాంబినేషన్‌లో వచ్చిన 'ఓ బేబీ' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సుదీర్ఘ విరామం తర్వాత ఈ సూపర్ హిట్ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అంచనాలు ఆకాశాన్నంటాయి. ఇక తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది. ప్రముఖ బాలీవుడ్/సౌత్ క్రియేటివ్ డైరెక్టర్, సమంత భర్త రాజ్ నిడిమోరు (Raj Nidimoru - Raj & DK ఫేమ్) ఈ చిత్రానికి అద్భుతమైన కథను అందించడం విశేషం. ఈ మోస్ట్ అవేటెడ్ మూవీ వచ్చే నెల జూన్ 19న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Read Also :Peddi Movie : బెంగళూరులో 'పెద్ది' సందడి.. కన్నడ ప్రమోషన్స్‌కు శ్రీకారం
Oh Baby Combo Reunion Samantha Nandini Reddy
అమాయకపు కోడలా? అండర్‌వరల్డ్ లేడీ డానా
ఈరోజు విడుదలైన ట్రైలర్ ప్రకారం సినిమా కథాంశం చాలా భిన్నంగా, అత్యంత ఆసక్తికరంగా ఉంది. ఒక పెద్ద ఉమ్మడి కుటుంబంలోకి ఎంతో పద్ధతిగా, అమాయకంగా అడుగుపెడుతుంది ఓ కోడలు (సమంత). అందరితో ఎంతో మృదువుగా మాట్లాడుతూ ఇంటికి నచ్చిన కోడలిగా మారుతుంది. అయితే పైకి ఎంతో సాఫ్ట్‌గా, ట్రెడిషనల్‌గా కనిపించే ఆమె వెనుక ఒక భయంకరమైన, పవర్‌ఫుల్ అండర్‌వరల్డ్ గతం దాగి ఉంటుంది. తన పాత జీవితాన్ని అత్తమామలకు, భర్తకు తెలియకుండా దాచిపెట్టి, సాధారణ గృహిణిగా బతకాలని ఆమె అనుకుంటుంది. కానీ కొన్ని దుష్టశక్తులు ఆమె కొత్త కాపురాన్ని, మెట్టినింటి వాళ్లను ప్రమాదంలోకి నెట్టాలని చూస్తాయి. దాంతో తన వారిని కాపాడుకోవడం కోసం ఆ కోడలు మళ్లీ పాత అవతారమెత్తి ఎలా తిరగబడింది అనేదే ఈ సినిమా ముఖ్య కథాంశం.
Maa Inti Bangaram Trailer: సమంత వన్-వుమన్ షో.. సంతోష్ నారాయణన్ మ్యూజిక్
ట్రైలర్‌లో సమంత రెండు భిన్నమైన షేడ్స్‌ను చాలా పర్‌ఫెక్ట్‌గా పండించింది. కుటుంబం కోసం సాఫ్ట్‌గా ఉండటం ఎంత ముఖ్యమో.. అదే కుటుంబంపై చెయ్యి పడితే మాస్ అవతారం ఎత్తడం అంతే ముఖ్యం అనిపించేలా సమంత యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. ముఖ్యంగా సాంప్రదాయ చీరకట్టులో ఉంటూనే గూండాలను ఊచకోత కోసే యాక్షన్ సీన్లలో సామ్ స్క్రీన్ ప్రెజెన్స్, ఆటిట్యూడ్ వేరే లెవెల్‌లో ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్‌కు నచ్చే ఎమోషన్స్, కామెడీతో పాటు మాస్ ప్రేక్షకులకు కావాల్సిన హై-వోల్టేజ్ యాక్షన్‌ను ఈ చిత్రంలో సమంగా మిక్స్ చేశారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ట్రైలర్‌లో ఆయన ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) విపరీతమైన పాజిటివ్ వైబ్స్‌ను క్రియేట్ చేసింది.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :
'డాన్ 3' వివాదంపై రణ్‌వీర్ స్పందన.. మౌనమే సమాధానమన్న హీరో

