Haribabu Murder: నిజామాబాద్‌లో యూట్యూబర్ వైష్ణవి భర్త చిత్తరి హరిబాబు (26) దారుణ హత్యకు గురయ్యాడు. గురువారం పట్టపగలే రాజరాజేంద్ర చౌరస్తా వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.
కారులో వచ్చిన కొందరు వ్యక్తులు హరిబాబుపై పదునైన ఆయుధంతో దాడి చేసి వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు. తీవ్ర గాయాలైన హరిబాబు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హరిబాబుపై దాడి చేసిన వ్యక్తులను గుర్తించేందుకు చౌరస్తా పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలోనే హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. హరిబాబు హత్యకు పాల్పడింది తానేనంటూ సంతోష్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. అనంతరం నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి లొంగిపోయాడు. హరిబాబును తానే హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించినట్లు సమాచారం.
Read Also : Nizamabad Crime: యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య

“It feels happy… yet sad too”: Selfie video by YouTuber Vaishnavi’s sister-in-law.
Haribabu Murder: సంతోష్ లొంగుబాటుపై భార్య భావోద్వేగ వీడియో
సంతోష్ పోలీసులకు లొంగిపోయిన అనంతరం అతని భార్య ఒక భావోద్వేగ వీడియోను విడుదల చేసింది. నా భర్త చేసిన పని తప్పో, ఒప్పో ప్రజలే చెప్పాలని ఆమె ఆ వీడియోలో పేర్కొంది. ఇద్దరు చిన్న పిల్లలను వదిలి తన భర్త జైలుకు వెళ్లడం ఎంతో బాధగా ఉందని, అయితే తన చెల్లెలు వైష్ణవిని హత్య చేసిన వ్యక్తి చనిపోయాడన్న తృప్తి మాత్రం మిగిలిందని ఆమె వ్యాఖ్యానించింది.
అండగా నిలవాలని ప్రజలకు విజ్ఞప్తి
తమ కుటుంబం ఎదుర్కొంటుంది తీవ్ర క్లిష్టమైన పరిస్థితులని, తన భర్త త్వరగా జైలు నుంచి బయటకు రావడానికి ప్రజలందరూ అండగా నిలవాలని ఆమె ఆ వీడియో ద్వారా కోరింది. నిందితుడు సంతోష్ లొంగిపోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని హత్యకు గల పూర్తి కారణాలపై విచారణ వేగవంతం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి.

