Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య

యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్య

వార్త 2 weeks ago

Nizamabad Crime: తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన ఘటనలో ప్రముఖ యూట్యూబర్ వైష్ణవి భర్త హరిబాబు దారుణ హత్యకు గురయ్యారు.

స్థానిక ఆర్‌ఆర్‌ చౌరస్తా ప్రాంతంలో జనసంచారం ఉండే నడిరోడ్డుపై గుర్తుతెలియని వ్యక్తి కారులో వచ్చి హరిబాబుపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హతమార్చాడు. ఈ అకస్మాత్తు పరిణామంతో స్థానికంగా ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి.

గతంలోని కేసు మరియు వైష్ణవి మృతి నేపథ్యం

గతంలో అదనపు కట్నం వేధింపుల వ్యవహారంలో నాలుగు నెలల గర్భిణీగా ఉన్న యూట్యూబర్ వైష్ణవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, ఆ హత్య వెనుక భర్త హరిబాబు ప్రమేయం ఉందంటూ తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ వివాదం అప్పట్లో పెద్దఎత్తున చర్చనీయాంశమైంది. ఇప్పుడు సరిగ్గా అదే కోణంలో లేదా కక్షసాధింపు చర్యల్లో భాగంగానే హరిబాబును కూడా అంతం చేశారా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు.

Nizamabad Crime: వెలుగులోకి వచ్చిన సీసీటీవీ ఫుటేజ్ – దర్యాప్తు ముమ్మరం

ఈ దారుణ హత్యకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని ఒక కెమెరాలో రికార్డు కాగా, ఆ సీసీటీవీ ఫుటేజ్ తాజాగా వెలుగులోకి వచ్చింది. కారులో వచ్చి అటాక్ చేసిన తీరు ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలను మరింత వేగవంతం చేశారు.

క్షుద్రపూజల ఆరోపణలు: మహేశ్‌కుమార్‌ గౌడ్, అద్దంకి దయాకర్‌పై హరీశ్‌రావు పరువునష్టం దావా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha