Pawan Kalyan: తెలంగాణలో పొలిటికల్ మైలేజ్ కోసమే తాను పర్యటిస్తున్నానంటూ కొందరు చేస్తున్న ఆరోపణలను జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పూర్తిగా తిరస్కరించారు.
“నాకు ఆంధ్రప్రదేశ్‌లోనే ముఖ్యమంత్రి అయ్యే దిక్కు లేదు.. ఇక తెలంగాణలో ఎందుకు అవుతాను?” అంటూ తనపై వస్తున్న విమర్శలకు తనదైన శైలిలో వ్యంగ్యంగా బదులిచ్చారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తనను, తన పార్టీని టార్గెట్ చేస్తూ కొందరు నాయకులు కావాలనే ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Pawan Kalyan Hyderabad Press Meet
Read also: Pawan Kalyan: గద్దర్‌పై పవన్ కల్యాణ్ భావోద్వేగ వ్యాఖ్యలు
తాటాకు చప్పుళ్లకు భయపడే ప్రసక్తే లేదు.. చావుకైనా సిద్ధమే!
తెలంగాణ ఉద్యమం ఉధృతం కాకముందు నుంచే తనకు ఈ గడ్డపై, ఇక్కడి విప్లవాత్మక సంస్కృతి, పోరాట స్ఫూర్తిపై ఎనలేని గౌరవం ఉందని, ఆ ప్రభావాన్ని తన చిత్రాల్లోనూ ప్రదర్శించానని పవన్ కల్యాణ్ గుర్తుచేశారు. తన పర్యటనలను భౌతికంగా అడ్డుకుంటామని, దాడులకు తెగబడతామని కొందరు హెచ్చరిస్తున్నారని.. అలాంటి బెదిరింపులకు తాను లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తానేమీ భయపడి వెనకడుగు వేయనని, చావుకైనా సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చి పార్టీ పెట్టానని హెచ్చరించారు. ఈ దేశంలో ఎక్కడైనా తిరిగే స్వేచ్ఛ తనకు రాజ్యాంగం కల్పించిందని, నన్ను ఎంతగా రెచ్చగొడితే అంత గట్టిగా నిలబడతానని రాబోయే రోజుల్లో తెలంగాణలో జనసేన కచ్చితంగా ఎన్నికల బరిలోకి దిగుతుందని సంచలన ప్రకటన చేశారు.
Pawan Kalyan: ప్రాంతీయ విద్వేషాలు ఉగ్రవాదం కంటే ప్రమాదకరం!
నాయకుల స్వార్థ రాజకీయాల కోసం రేపుతున్న ప్రాంతీయ విద్వేషాలు, దేశ సమగ్రతకు ఉగ్రవాదం కంటే అత్యంత ప్రమాదకరంగా మారుతున్నాయని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక్కడ స్థానికంగా ఉపాధి అవకాశాలు లభించకపోయినా, పరిశ్రమలు రాకపోయినా దానికి పక్క రాష్ట్రం వాళ్లే కారణం అన్నట్లుగా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. రాజకీయ నాయకుల మధ్య ఉండే విభేదాలను, స్వార్థ ప్రయోజనాలను సామాన్య ప్రజలకు అంటించి వారి మధ్య గోడలు కట్టవద్దని పవన్ కల్యాణ్ గట్టిగా విజ్ఞప్తి చేశారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com

