Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గద్దర్‌పై పవన్ కల్యాణ్ భావోద్వేగ వ్యాఖ్యలు

గద్దర్‌పై పవన్ కల్యాణ్ భావోద్వేగ వ్యాఖ్యలు

వార్త 2 months ago

Pawan Kalyan: ప్రజా గాయకుడు, దివంగత గద్దరన్నతో తనకు ఉన్న వ్యక్తిగత, భావోద్వేగ అనుబంధాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ..

గద్దర్ బతికి ఉన్న సమయంలో ఆయన కష్టాలను, అవసరాలను అస్సలు పట్టించుకోని వారే ఇప్పుడు ఆయన పేరు ఎత్తుతూ రాజకీయం చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. తనపై విమర్శలు గుప్పించే నాయకులు గద్దర్ గురించి మాట్లాడటంపై పవన్ కల్యాణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

 Pawan Kalyan Hyderabad Press Meet

read also:Bhatti Vikramarka: అర్హులైన వారి ఓట్లు గల్లంతు కాకుండా మీడియా దృష్టి పెట్టాలి :డిప్యూటీ సీఎం భట్టి

అడిగిన 24 గంటల్లోనే బండి కొనిచ్చా.. ఎప్పుడూ ప్రచారం చేసుకోలేదు!

“గద్దరన్న శరీరంలో బుల్లెట్లు ఉండిపోయి, ఆయన నడవడానికి తీవ్రంగా నరకయాతన పడుతున్న రోజుల్లో నా దగ్గరకు వచ్చారు. ‘ఆటోల్లో తిరగలేకపోతున్నా తమ్మీ.. ఒక బండి కొనివ్వవా’ అని నన్ను ఎంతో హక్కుగా అడిగారు. ఆయన నన్ను సొంత తమ్ముడిలా భావించి ‘ఒరే’ అని పిలిచేవారు. ఆయన అడిగిన 24 గంటల లోపే నేను వాహనాన్ని కొనిపించి ఇచ్చాను. కానీ ఆ రోజుల్లో నేనెప్పుడూ ఈ విషయాన్ని ప్రచారం చేసుకోలేదు. గద్దరన్న బతికున్నప్పుడు మీరంతా ఎక్కడికి పోయారు? ఆయనకు మీరేం సాయం చేశారు?” అని పవన్ కల్యాణ్ ఉద్వేగంగా నిలదీశారు. గద్దరన్నతో తనకున్న బంధం రాజకీయ ప్రయోజనాల కోసం పుట్టింది కాదని స్పష్టం చేశారు.

Pawan Kalyan: 11 రోజులు అన్నం తినలేదనేది పచ్చి అబద్ధం!

ఇదే వేదికపై తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై తనపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని పవన్ కల్యాణ్ గట్టిగా తిప్పికొట్టారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు తాను 11 రోజుల పాటు భోజనం చేయలేదంటూ కొందరు పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఎన్నడూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఇక్కడి ప్రజల ఆకాంక్షను వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. కేవలం నాటి పార్లమెంట్ తలుపులు మూసివేసి, ఏకపక్షంగా, అప్రజాస్వామికంగా రాష్ట్రాన్ని విభజించిన పద్ధతిని మాత్రమే తాను తప్పుపట్టానని వివరించారు. కొందరు రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం తనపై ప్రాంతీయ విద్వేషాలను రేకెత్తించడానికి ప్రయత్నిస్తున్నారని, తన గుండెల్లో ఎప్పటికీ తెలంగాణపై ఎనలేని ప్రేమ ఉంటుందని పవన్ కల్యాణ్ చాటిచెప్పారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

వరి ధాన్యం కొనుగోళ్లపై అగ్రహం వ్యక్తం చేస్తున్న రైతన్నలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha