Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆపదలో 'శక్తి'గా నిలుద్దాం: విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించిన చిత్తూరు పోలీసులు

ఆపదలో 'శక్తి'గా నిలుద్దాం: విద్యార్థినులకు చట్టాలపై అవగాహన కల్పించిన చిత్తూరు పోలీసులు

వార్త 2 months ago

Chittoor: చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు శక్తి టీం నోడల్ అధికారి అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ ఇంచార్జ్ అడ్మిన్ ఎస్. ఆర్.రాజశేఖర్ రాజు పర్యవేక్షణలో శక్తి బృందాలు , మహిళా స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస రావు మరియు ఎస్.ఐ.

కరిమునిస్సా గురువారం రోజు చిత్తూరు పట్టణములోని యన్.పీ. సావిత్రమ్మ ప్రభుత్వం మహిళా కళాశాల మహిళలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, బాల్యవివాహం ఒక పెద్ద సమస్య. బాలికలు 18 సంవత్సరాలు పూర్తిచేయక ముందే పెళ్లి జరపడం చట్ట విరుద్ధం. చిన్న వయసులో పెళ్లి చేస్తే చదువు ఆగిపోవడం, ఆరోగ్య సమస్యలు రావడం, భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. అందుకే మీరు చదువులో ముందుకు వెళ్లి, జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవాలన్నారు.

Read Also:SPMVV Tirupati: న్యాయమూర్తిగా పద్మావతి వర్సిటీ విద్యార్థిని

Chittoor: పోక్సో చట్టం: వేధింపులకు కఠిన శిక్షలు

పోక్సో చట్టం చాలా కఠినమైనది. 18 సంవత్సరాల లోపు పిల్లలపై లైంగిక వేధింపులు, దాడులు జరిగితే దానికి కఠినమైన శిక్షలు ఉంటాయి. ఇలాంటి సంఘటన ఎప్పుడైనా ఎదురైతే భయపడకుండా పోలీసులకు తెలియజేయాలి.అత్యవసర పరిస్థితుల్లో 112 (ఎమర్జెన్సీ నంబర్), 1098 (చైల్డ్ హెల్ప్‌లైన్), వంటి హెల్ప్‌లైన్ నంబర్లను గుర్తుంచుకోవాలి. ఇవి మీకు వెంటనే సహాయం అందిస్తాయి.

బాలికల కోసం ప్రభుత్వం అందించిన శక్తి యాప్ చాలా ఉపయోగకరమైనది. ఎటువంటి ప్రమాదం ఎదురైనా ఆ యాప్‌లో సులభంగా పోలీసులకు సమాచారం ఇవ్వగలరు. మీ భద్రత కోసం తప్పనిసరిగా ఈ యాప్ ఉపయోగించాలి.మహిళా స్టేషన్ ఎస్.ఐ. కరిమునిస్సా మాట్లాడుతూ మహిళల భద్రత కోసం ప్రభుత్వం ప్రారంభించిన శక్తి యాప్ అత్యవసర సమయంలో ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు. అత్యవసర సమయంలో ఒకే (SOS) బటన్ ప్రెస్ చేయగానే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం చేరుతుంది.

ఈ యాప్ అత్యవసర పరిస్థితుల్లో మహిళలకు తక్షణ సహాయం అందించేందుకు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో యాప్ ద్వారా పోలీసులకు సమాచారం చేరవేయడం, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో పాటు, అత్యవసర సేవలు అందించేందుకు ఇది ఎంతో మేలైన సాధనమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, ఉపాద్యాయులు మరియు శక్తీ టీం సిబ్బంది పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

తిరుపతిలో ఘనంగా ఎన్ ఎస్ యు ఐ 56 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha