Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్చరీ స్టార్ ధీరజ్ బొమ్మదేవరపై వైఎస్ జగన్ ప్రశంసలు!

ఆర్చరీ స్టార్ ధీరజ్ బొమ్మదేవరపై వైఎస్ జగన్ ప్రశంసలు!

వార్త 2 weeks ago

Bommadevara Dheeraj Archery: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్-3 టోర్నీలో అద్భుత ప్రదర్శనతో రెండు స్వర్ణ పతకాలు సాధించి, దేశ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన ఆంధ్రప్రదేశ్ అగ్రశ్రేణి ఆర్చర్ బొమ్మదేవర ధీరజ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ధీరజ్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా ధీరజ్‌కు ప్రత్యేక అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

Read also: FIH Womens Nations Cup: FIH ఉమెన్స్ హాకీలో అమెరికాపై ఘన విజయం సాధించిన భారత్

Bommadevara Dheeraj Archery: ఒకే రోజు రెండు గోల్డ్ మెడల్స్.. ధీరజ్ సంచలనం

విజయవాడకు చెందిన 24 ఏళ్ల బొమ్మదేవర ధీరజ్ ఈ టోర్నీలో తిరుగులేని ఫామ్‌ను ప్రదర్శించాడు. ముందుగా మహారాష్ట్రకు చెందిన 17 ఏళ్ల కుంకుమ్ మొహోద్‌తో కలిసి రికర్వ్ మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కు బంగారు పతకం అందించాడు. ఆ తర్వాత ఏమాత్రం అలసట లేకుండా సాగిన రికర్వ్ వ్యక్తిగత (ఇండివిడ్యువల్) విభాగంలోనూ పసిడి పతకాన్ని సొంతం చేసుకుని డబుల్ ధమాకా సృష్టించాడు. ఈ అసాధారణ ప్రదర్శనతో ధీరజ్ ఆర్చరీ సీజన్ ముగింపు టోర్నీ అయిన ప్రతిష్టాత్మక ‘వరల్డ్ కప్ ఫైనల్స్’కు కూడా అర్హత సాధించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read also:

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వైఎస్ జగన్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha