Dailyhunt
ఆరెంజ్ ఆర్మీ బోణీ కొట్టేనా? ఆర్‌సీబీతో సన్‌రైజర్స్ 'ఢీ'

ఆరెంజ్ ఆర్మీ బోణీ కొట్టేనా? ఆర్‌సీబీతో సన్‌రైజర్స్ 'ఢీ'

వార్త 3 weeks ago

SRH vs RCB: ఐపీఎల్ 2026 సీజన్ సమరానికి తెరలేచింది. శనివారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరగనున్న ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తలపడనుంది.

గత సీజన్‌లో ఆరో స్థానంతో సరిపెట్టుకున్న ఆరెంజ్ ఆర్మీ, ఈసారి ఎలాగైనా కప్పు గెలవాలనే పట్టుదలతో బరిలోకి దిగుతోంది.

Read Also: PSL viral incident : వైట్ బాల్ పింక్ అయింది.. పీఎస్ఎల్ ట్రోల్

ఇషాన్ కిషన్ చేతికి పగ్గాలు.. కమిన్స్ దూరం!

తొలి మ్యాచ్‌కు ముందే సన్‌రైజర్స్‌కు గట్టి షాక్ తగిలింది. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, స్టార్ బౌలర్ ఇషాన్ మలింగా గాయాల కారణంగా ఈ మ్యాచ్‌కు అందుబాటులో ఉండటం లేదు. దీంతో కమిన్స్ గైర్హాజరీలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ జట్టును నడిపించనున్నాడు. టీ20 ప్రపంచకప్ విజయం, దేశవాళీ టోర్నీల్లో రాణించిన ఊపులో ఉన్న ఇషాన్.. కెప్టెన్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.

 SRH vs RCB IPL 2026 Opening Match

చిన్నస్వామిలో పరుగుల వరద ఖాయం

బ్యాటింగ్‌కు స్వర్గధామం వంటి చిన్నస్వామి పిచ్‌పై సన్‌రైజర్స్ బ్యాటర్లు చెలరేగిపోయే అవకాశం ఉంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ వంటి విధ్వంసకర ఓపెనర్లతో పాటు హెన్రీచ్ క్లాసెన్ మిడిల్ ఆర్డర్‌లో ఉండటం జట్టుకు పెద్ద ప్లస్ పాయింట్. బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తున్నా, భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టాలని హైదరాబాద్ భావిస్తోంది.

నయా ఫినిషర్ 'సలీల్ అరోరా' అరంగేట్రం?

ఈ మ్యాచ్ ద్వారా యువ సంచలనం సలీల్ అరోరా ఐపీఎల్ అరంగేట్రం చేసే అవకాశం కనిపిస్తోంది. రింకూ సింగ్ తరహాలో మెరుపు వేగంతో పరుగులు రాబట్టగల సలీల్, ప్రాక్టీస్ మ్యాచ్‌ల్లో అదరగొట్టాడు. అనికేత్ వర్మ నుంచి పోటీ ఉన్నప్పటికీ, ఫినిషర్ పాత్రలో సలీల్‌కే మొగ్గు చూపే అవకాశం ఉంది.

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI

ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్(కెప్టెన్), హెన్రీచ్ క్లాసెన్, సలీల్ అరోరా/అనికేత్ వర్మ, లియామ్ లివింగ్ స్టోన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, హర్ష్ దూబే, బ్రైడన్ కార్స్, జయదేవ్ ఉనాద్కత్

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

RCB vs SRH పోరుకు సర్వం సిద్ధం.. కానీ బెంగళూరుకు బిగ్ షాక్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha