Hyderabad Cyber Crime: టెక్నాలజీని కొందరు నేరగాళ్లు ఎంత దారుణంగా వాడుకుంటున్నారో చెప్పడానికి హైదరాబాద్‌లో జరిగిన ఈ ఘటనే ఉదాహరణ. తాను ఆర్మీ అధికారిని అని చెప్పుకుంటూ సోషల్ మీడియా ద్వారా నాగోల్ బండ్లగూడ ప్రాంతానికి చెందిన ఒక యువతితో పరిచయం పెంచుకున్నాడు శామీర్‌పేట్ ప్రాంతానికి చెందిన ముకేరా గోవర్ధన్ (29).
సదరు యువతికి తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సహాయంతో ఆర్మీ యూనిఫామ్‌లో ఉన్న తన నకిలీ ఫోటోలను సృష్టించి నమ్మబలికాడు.
Read Also: Cumbum Road Accident: పెళ్లి ఇంట విషాదం.. కంభం జాతీయ రహదారిపై లారీ బీభత్సం..నలుగురు మృతి!
Man deceives young woman under the pretext of marriage by claiming to be an Army officer.
Hyderabad Cyber Crime: తండ్రి ఆరోగ్యం బాగాలేదంటూ భారీగా వసూళ్లు
తాను ఆర్మీలో పెద్ద ఉద్యోగం చేస్తున్నానని, త్వరలోనే పెళ్లి చేసుకుంటానని నమ్మించిన గోవర్ధన్.. ఆపై అసలు రంగు బయటపెట్టాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని, అత్యవసరంగా డబ్బులు కావాలంటూ సదరు యువతి నుంచి భారీ ఎత్తున నగదు గుంజాడు. పెళ్లి చేసుకోబోయేవాడే కదా అని నమ్మిన ఆ యువతి అతడు అడిగినప్పుడల్లా డబ్బులు ఇస్తూ పోయింది. కొన్నాళ్ల తర్వాత అతడి ప్రవర్తన, మాట తీరుపై యువతికి అనుమానం వచ్చింది. దీంతో ఆమె అతడిని గట్టిగా నిలదీయగా.. పెళ్లి మాట దేవుడెరుగు, ఎదురు సదరు యువతిని బెదిరించడం ప్రారంభించాడు. దీంతో తాను ఘోరంగా మోసపోయానని గ్రహించిన బాధితురాలు తక్షణమే పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. పోలీసులు సాంకేతిక ఆధారాలతో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
పాత నేరస్తుడే.. బెయిల్‌పై వచ్చి మళ్లీ అదే దందా!
పోలీసుల విచారణలో నిందితుడు గోవర్ధన్ గురించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇతగాడు గతంలోనూ పలువురు మహిళలను ఇదే తరహాలో ఆర్మీ ఆఫీసర్ అని నమ్మించి మోసం చేసినట్లు తేలింది. గతంలో అల్వాల్ ప్రాంతానికి చెందిన ఒక మహిళను మోసం చేసిన కేసులో జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చిన గోవర్ధన్, తన బుద్ధి మార్చుకోకుండా ‘ఏఐ’ టెక్నాలజీని వాడుకొని నాగోల్ యువతిని వంచించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని రిమాండుకు తరలించారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com

