Dailyhunt
ఆరోగ్యం గుల్లచేస్తున్న నకిలీ అల్లం పేస్ట్

ఆరోగ్యం గుల్లచేస్తున్న నకిలీ అల్లం పేస్ట్

వార్త 2 weeks ago

Hyderabad Fake Ginger Garlic: కాటేదాన్ పారిశ్రామిక వాడ నకిలీల తయారీ అక్రమార్కులకు అడ్డాగా మారింది. నిత్యం అధికారులు తనిఖీలు చేసి నిర్వాహకులను అరెస్టు చేసి కంపెనీలను సీజ్ చేస్తున్నా మళ్లీ పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి.

మంగళవారం మైలార్ దేవ్ పల్లి పోలీసుస్టేషన్ పరిధిలోని కాటేదాన్ పారిశ్రామిక ప్రాంతంలో హైదరాబాద్ కాటేదాన్ పారిశ్రామికవాడలో కుప్పతెప్పలుగా నకిలీ కంపెనీలు అల్లంవెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారని పక్కా పేస్ట్ను తయారుచేస్తున్నట్లు అధికారులు సమాచారంతో దాడులు నిర్వహించి అబిడ్స్కు గుర్తించారు. నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి 4 వేల కిలోల పేస్ట్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.

Read Also : Telangana Scholarship Date Extended: స్కాలర్ షిప్ దరఖాస్తు గడువు 20 వరకు పొడిగింపు

 Hyderabad Fake Ginger Garlic: Fake ginger paste that is ruining your health

Hyderabad Fake Ginger Garlic: ప్లాస్టిక్ డబ్బాల్లో కలుషిత పేస్టు తయారు

కలుషిత అల్లం, వెల్లుల్లి పేస్ట్ తయారీ కేంద్రంపై హైదరాబాద్ కమిషనర్ టాస్క్ ఫోర్స్, హెచ్ ఫాస్ట్ బృందం సంయుక్తంగా దాడులు చేశాయి. ఎస్కీఆర్ ఫుడ్ ప్రొడక్ట్స్ కంపెనీలో నకిలీ చెందిన నిందితుడైన హసన్అలీ రూపానీ ( 55)ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అపరిశుభ్ర వాతావరణం, అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల్లో ప్లాస్టిక్ డబ్బాల్లో కలుషిత పేస్టు తయారు చేస్తున్నారు. అదేవిధంగా పేస్ట్ తయారీలో ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్ వంటి రసాయనాలను కలుపుతున్నట్లు గుర్తించారు. ఈ కలుషిత పేస్ట్ను బహిరంగ ప్రదేశాల్లో ఉంచడం వల్ల దుమ్ము, ఈగలు వాలినట్లు పోలీసులు గమనించారు.

దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా

దీనిని హోల్ సేల్ కిరాణా దుకాణాలకు, క్యాటరింగ్ సర్వీసులకు సరఫరా చేస్తూ ప్రజల ఆరోగ్యంతో చెల గాటం ఆడుతున్నారన్నారు. రూ. 22,00,000, 24,0325 అల్లం వెల్లుల్లి పేస్ట్ స్వాధీనం చేసుకున్నారు. 6,000 కిలోల నాణ్యత లేని వెల్లుల్లి, 210 కిలోల నాణ్యత లేని అల్లం, వెల్లుల్లి పొట్టు సంచులు, 250 కిలోల ఉప్పు, ఎసిటిక్ యాసిడ్, గ్జాంతమ్ గమ్ పౌడర్, 5 గ్రైండింగ్ యంత్రాలు సీజ్ చేశారు. నిందితుడిని, సీజ్ చేసిన సామాగ్రిని తదుపరి చర్యల నిమిత్తం మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఒకు అప్పగించారు. ఈ ఆపరేషన్లో ఖైరతాబాద్ టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ పి. రాఘవేందర్, ఎస్సై శ్రీకాంత్, మైలార్దేవ్పల్లి ఎస్సై విశ్వనాథ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha