Telangana Scholarship Date Extended: తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, పీహెచ్సీ విద్యార్థులు స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి దరఖాస్తు గడువును పొడిగించారు.
గతంలో ప్రకటించినట్టుగా దరఖాస్తు గడువు మార్చి 31 వరకు ఉండగా.. దానిని కాస్త ఈ నెల 20 వరకు పొడిగించారు. 2025-26 విద్యా సంవత్సరానికి కొత్తగా స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడంతోపాటు గతంలో దరఖాస్తు చేసుకొని రెన్యూవల్ స్కాలర్షిప్ల మంజూరు కోసం తెలంగాణ ఇపాస్ వెబ్సైట్లో కళాశాలలు, విద్యార్థుల నమోదుకు గడువును ఈ నెల 20 వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Read Also : Tamil Nadu Election 2026 : కేరళ గెలుపు కోసం కాంగ్రెస్ సరికొత్త వ్యూహం
Telangana Scholarship Date Extended: Scholarship application deadline extended until 20
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్
పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ల మంజూరు పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికి ఇ
పాస్ పోర్టల్ అనే ఆన్లైన్ సిస్టమ్ వెబ్సైట్ను అమలు చేస్తున్నారు. పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కింద కొత్తగా దరఖాస్తు, పునరుద్ధరణ స్కాలర్షిప్ల మంజూరు కోసం డేటాను ప్రాసెస్ చేయడానికి, నమోదు చేసుకోవడానికి ఈ సిస్టమ్ కళాశాలలు, విద్యార్థుల రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. గత ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, పీహెచ్సీ విద్యార్థులు 10,89,253 మంది స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 9,70,243 మంది మాత్రమే నమోదు చేసుకున్నారు. కొత్తగా వివిధ కోర్సుల్లో 2025-26 విద్యా సంవత్సరంలో చేరిన విద్యార్థుల్లో ఇప్పటి వరకు 3,70,375 మంది మాత్రమే స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also :

