Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్థిక సంక్షోభంలో అండగా నిలిచిన భారత్.. శ్రీలంక మంత్రి ధన్యవాదాలు

ఆర్థిక సంక్షోభంలో అండగా నిలిచిన భారత్.. శ్రీలంక మంత్రి ధన్యవాదాలు

వార్త 2 days ago

Sri Lanka: తమ దేశం గతంలో మునుపెన్నడూ లేనివిధంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న తరుణంలో సమయానికి స్పందించి ఆదుకున్న భారత ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు శ్రీలంక ప్రభుత్వం తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.

న్యూఢిల్లీలో జరిగిన ఒక ప్రతిష్టాత్మక సదస్సులో పాల్గొన్న శ్రీలంక పరిశ్రమలు, వ్యవస్థాపక అభివృద్ధి శాఖ డిప్యూటీ మంత్రి చతురంగ అబేసింఘే ఈ వ్యాఖ్యలు చేశారు. అత్యంత కష్టతరమైన పరిస్థితుల్లో భారత్ తమకు ఒక భరోసాగా, వెన్నెముకలా నిలిచిందని ఆయన ప్రశంసించారు.

2022 నాటి భీకర ఆర్థిక సంక్షోభాన్ని గుర్తుచేసుకున్న అబేసింఘే

ఈ సందర్భంగా 2022లో శ్రీలంకను చుట్టుముట్టిన ఉక్కిరిబిక్కిరి చేసే ఆర్థిక సంక్షోభ భీకర వాతావరణాన్ని మంత్రి అబేసింఘే గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో దేశంలో ఇంధనం, నిత్యావసర వస్తువుల కొరత తీవ్రమైందని, ద్రవ్యోల్బణం ఆకాశాన్నంటడంతో పాటు విదేశీ మారకద్రవ్య నిల్వలు పూర్తిగా అడుగంటిపోయి దేశం అల్లకల్లోలంగా మారిందని వివరించారు. “ఆ అత్యంత క్లిష్టమైన సమయంలో మాకు అండగా నిలిచిన భారత్‌కు మా ధన్యవాదాలు. మీరు అందించిన సకాలంలో ఆర్థిక సహాయం మా దేశాన్ని ఆ గండం నుంచి గట్టెక్కించడానికి ఎంతో దోహదపడింది” అని ఆయన గుర్తుచేసుకున్నారు.

Sri Lanka: సంక్షోభం నుంచి కోలుకున్న లంక.. ఆర్థిక స్థిరత్వమే ప్రధాన లక్ష్యం

ప్రస్తుతం శ్రీలంక ఆ పాత సంక్షోభ ఛాయల నుంచి పూర్తిగా బయటపడిందని, దేశంలో ఆర్థిక స్థిరత్వాన్ని పటిష్టం చేయడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిందని అబేసింఘే స్పష్టం చేశారు. సకాలంలో రుణాల పునర్‌వ్యవస్థీకరణ చేపట్టడంతో పాటు, భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులు మళ్లీ తలెత్తకుండా అనేక కీలక ఆర్థిక సంస్కరణలను అమలు చేశామని తెలిపారు. ఇకపై విదేశీ రుణాల చెల్లింపుల విషయంలో ఎలాంటి రిస్క్ లేదా సమస్యలు ఉండవని ఆయన పూర్తి ధీమా వ్యక్తం చేశారు.

భారత్‌ను ఆదర్శంగా తీసుకుంటూ.. వృద్ధి పథం వైపు లంక పయనం

ఇకపై దేశాన్ని కేవలం స్థిరత్వం వైపు కాకుండా నిలకడైన వృద్ధి పథం వైపు నడిపిస్తామని, ఇందులో మౌలిక వసతుల అభివృద్ధి కీలక భూమిక పోషిస్తుందని మంత్రి వెల్లడించారు. 1990లలో భారత్ తన మార్కెట్లను అంతర్జాతీయ వాణిజ్యం కోసం క్రమంగా తెరిచిన విధానం తమకు చక్కటి ఆదర్శమని అభిప్రాయపడ్డారు. పారా-టారిఫ్‌ల తొలగింపు, నూతన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల (FTAs) కుదుర్చుకోవడం ద్వారా వేగంగా పురోగతి సాధిస్తామని చెప్పారు. 2019 నుంచి నిలిచిపోయిన పలు ప్రాజెక్టులను పునరుద్ధరిస్తున్నామని, రాబోయే 3 నుంచి 5 ఏళ్లలో పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో సరికొత్త మార్పుల కోసం ఇతర దేశాలతో భాగస్వామ్యానికి సిద్ధంగా ఉన్నామని చతురంగ అబేసింఘే పేర్కొన్నారు.

కర్ణాటకలో విషాదం: బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha