Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కర్ణాటకలో విషాదం: బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురు మృతి

కర్ణాటకలో విషాదం: బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురు మృతి

వార్త 2 days ago

Kodagu Car Accident: కర్ణాటక రాష్ట్రంలోని కొడగు జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. కారు అదుపుతప్పి చెరువులో పడిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ప్రమాదం మడికెరి తాలూకా పరిధిలోని మాల్యారె ప్రాంతంలో జరిగింది. ప్రమాదంలో సిద్ధాపుర హైస్కూల్ పైసారికి చెందిన విజేశ్‌ (36), ఆయన భార్య ప్రమిత (34), నలుగురు సంవత్సరాల పసికందు లియ (4) దుర్మరణం చెందారు.

Read Also : Tragic accident in Kakinada: కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురు భవానీ భక్తులు మృతి

 Tragedy in Karnataka: Car gets stuck in mud; three die from suffocation

Kodagu Car Accident: ఎలా జరిగిందంటే..?

విజేశ్ దంపతులు తమ కారులో మాల్యారె వద్ద ఉన్న బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ తమ పెద్ద కూతురిని ఉంచి, చిన్న కూతురు లియను వెంటబెట్టుకుని తాము పనిచేస్తున్న ఎస్టేట్‌కు తిరిగి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న మార్గంలోని చెరువు కట్ట రోడ్డుపై వెళుతుండగా.. అకస్మాత్తుగా కారు ఒక చక్రం రోడ్డు కిందకు జారింది. దీంతో అదుపుతప్పిన కారు నేరుగా చెరువులోని దట్టమైన బురదలోకి దూసుకెళ్లి దిగబడిపోయింది. రాత్రి సమయం కావడంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఆ ప్రమాదాన్ని గుర్తించలేకపోయారు.

ఊపిరాడక కారులోనే ప్రాణాలు వదిలిన వైనం

చెరువులోని బురదలో కారు పూర్తిగా కూరుకుపోవడంతో బాధితులు ఎవరూ బయటకు రాలేకపోయారు. కారులోనే ఊపిరాడక విలవిల్లాడుతూ ముగ్గురూ ప్రాణాలు వదిలారు. బుధవారం ఉదయం ఆ మార్గంలో వెళ్తున్న కార్మికులు చెరువులో కారును గమనించి వెంటనే స్థానికుల సహాయంతో లోపలివారిని బయటకు తీశారు. అప్పటికే వారు మృతి చెందినట్లు గుర్తించి సిద్ధాపుర ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే వారు చనిపోయినట్లు ధ్రువీకరించారు. అనంతరం మృతదేహాలను మడికెరి ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. బంధువుల ఇంటి వద్ద ఉన్న పెద్ద కూతురు మినహా తల్లిదండ్రులు, చెల్లి ప్రాణాలు కోల్పోవడంతో ఆ చిన్నారి అనాథగా మారడం స్థానికులను కంటతడి పెట్టించింది.

శ్రీకాకుళం బీచ్‌లో విషాదం.. సముద్రంలో కొట్టుకుపోయి నలుగురు మృతి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha