Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్టీఐ దరఖాస్తులపై కీలక చర్య

ఆర్టీఐ దరఖాస్తులపై కీలక చర్య

వార్త 2 weeks ago

RTI Act: ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీఐ దరఖాస్తుల విషయంలో సమాచార కమిషన్ కీలక చర్యలు చేపట్టింది. పల్నాడు జిల్లా వేల్పూరుకు చెందిన యడ్ల భద్రయ్యపై ఏపీ సమాచార కమిషన్ ఆంక్షలు విధించింది.

ఆయన ఇప్పటివరకు వెయ్యికి పైగా సమాచార హక్కు చట్టం (RTI) దరఖాస్తులు, 300కు పైగా రెండో అప్పీళ్లు దాఖలు చేసినట్లు కమిషన్ పేర్కొంది.

Mangalagiri Tadepalli Flood: వరద ముంపు నివారణకు రూ.68 కోట్లు

పునరావృత దరఖాస్తులపై నిషేధం

ఇప్పటికే సమాచారం అందించిన అంశాలపైనే మళ్లీ మళ్లీ ఆర్టీఐ దరఖాస్తులు, అప్పీళ్లు దాఖలు చేస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ఒకే అంశానికి సంబంధించి పునరావృతంగా దరఖాస్తులు, రెండో అప్పీళ్లు చేయడాన్ని నిలిపివేయాలని కమిషన్ ఆదేశించింది.

RTI Act: ఇప్పటికే సమాచారం ఇచ్చిన అంశాలపై మళ్లీ దరఖాస్తులు వద్దు

ఇప్పటికే సంబంధిత అధికారులు సమాచారం అందించిన అంశాలపై భద్రయ్య మళ్లీ ఆర్టీఐ దరఖాస్తులు దాఖలు చేయకూడదని సమాచార కమిషన్ స్పష్టం చేసింది. అలాగే అదే అంశంపై పునరావృతంగా రెండో అప్పీళ్లకు వెళ్లకూడదని ఆదేశించింది. సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవడం ప్రతి పౌరుడి హక్కు అయినప్పటికీ, ఒకే అంశంపై పదేపదే దరఖాస్తులు, అప్పీళ్లు దాఖలు చేయడంపై కమిషన్ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

Epaper: epaper.vaartha.com

కడప వేదికగా సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha