CM Chandrababu: కడప జిల్లా ప్రొద్దుటూరు పర్యటనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో తీవ్ర విధ్వంసం జరిగిందని, దాన్ని సరిదిద్దుతూ రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కడప జిల్లా అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ మాజీ సీఎంకు సవాల్ విసిరారు.
గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వం ‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమాన్ని చేపట్టిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. మదనపల్లెలో ఏర్పాటు చేయనున్న హార్టికల్చర్ హబ్‌తో రాయలసీమ ప్రాంత దశ-దిశ పూర్తిగా మారబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో నిరుపేదలైన ప్రతి ఒక్కరికీ ఇల్లు నిర్మించి ఇచ్చే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగుల నైపుణ్యాభివృద్ధికి ‘కర్మయోగి’, సాంకేతికతను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లేందుకు అమరావతిలో ‘పాన్ IIT కౌన్సిల్’ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
Markapuram Ongole Railway Line: ఏపీలో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన
CM Chandrababu makes key remarks in Kadapa.
CM Chandrababu: కేంద్ర నిధుల వినియోగంపై గత ప్రభుత్వంపై విమర్శలు
కేంద్ర ప్రభుత్వ నిధులను దక్కించుకోవడంలో గత ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని చంద్రబాబు విమర్శించారు. జల్ జీవన్ మిషన్ కింద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ. లక్ష కోట్లు, చిన్న రాష్ట్రమైన అసోం రూ. 34 వేల కోట్లు రాబట్టుకుంటే.. గత వైకాపా ప్రభుత్వం కేవలం రూ. 2,016 కోట్లు మాత్రమే సాధించి నిర్లక్ష్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిందని మండిపడ్డారు.
గోదావరి-కావేరి నదుల అనుసంధానం
గోదావరి-కావేరి నదుల అనుసంధానం తన డ్రీమ్ ప్రాజెక్టు అని, దీనివల్ల నాలుగు రాష్ట్రాల సాగునీటి కష్టాలు శాశ్వతంగా తొలగిపోతాయని సీఎం తెలిపారు. అలాగే లిక్కర్ స్కామ్, మాజీ వివేకానందరెడ్డి హత్య కేసులపై స్పందిస్తూ.. నేరాలు చేసి ఎదుటివారిపై నిందలు వేయడం విపక్షానికి అలవాటుగా మారిందని, వివేకా హత్య కేసులో నిజా నిజాలన్నీ బయటకు కక్కిస్తామని హెచ్చరించారు.
ఈ సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదని అభిప్రాయపడ్డారు. రాయలసీమ అభివృద్ధి సభలో అనవసర రాజకీయ విమర్శలు తగవని, ప్రత్యర్థులు హద్దులు మీరినప్పుడే యుద్ధం చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.
Epaper: epaper.vaartha.com
ప్రొద్దుటూరులో 'అమరజీవి జలధార'ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

