Vizianagaram: విజయనగరం జిల్లాలో ఆర్టీసీ బస్సులో చోటుచేసుకున్న ఓ చిన్న వివాహం చిలికి చిలికి గాలివానలా మారి ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. కేవలం బస్సు సీటు కోసం మహిళలు ఒకరిపై ఒకరు దారుణంగా దాడులు చేసుకున్నారు.
విజయనగరం జిల్లా బొబ్బిలి సమీపంలో ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సులో కూర్చునే స్థలం విషయంలో ప్రయాణికుల మధ్య వాగ్వాదం మొదలైంది. ఈ క్రమంలో మహిళలు ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ తోపులాటలో బెజ్జుపల్లి భార్గవి (14) అనే బాలిక తీవ్రంగా గాయపడింది.
Vizianagaram: ఆసుపత్రికి తరలింపు
దాడిలో తీవ్ర గాయాలపాలైన భార్గవి పరిస్థితి విషమంగా మారడంతో, స్థానికులు మరియు తోటి ప్రయాణికులు వెంటనే స్పందించి ఆమెను విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ బాలికకు వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. చిన్నపాటి వివాదం ఇంతటి హింసాత్మక ఘటనకు దారితీయడంపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
కేక్ పూసినందుకే ముగ్గురిని చంపిన కిరాతకుడు.. పోలీసుల కాల్పుల్లోనిందితుడు మృతి

