Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
కేక్ పూసినందుకే ముగ్గురిని చంపిన కిరాతకుడు.. పోలీసుల కాల్పుల్లోనిందితుడు మృతి

కేక్ పూసినందుకే ముగ్గురిని చంపిన కిరాతకుడు.. పోలీసుల కాల్పుల్లోనిందితుడు మృతి

వార్త 1 month ago

UP Crime: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో జరిగిన దారుణమైన ముగ్గురి హత్య (ట్రిపుల్ మర్డర్) కేసులో ప్రధాన నిందితుడు జీతూ సైనీ పోలీసుల ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు.

కేవలం ముఖానికి కేక్ పూశారన్న చిన్న కారణంతో ముగ్గురిని పొట్టనబెట్టుకున్న ఈ నిందితుడి అంతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Read Also: Jabalpur Boat Accident: తుదిశ్వాసలోనూ వీడని తల్లిప్రేమ.. ఒకే కౌగిలిలో విగతజీవులైన తల్లిబిడ్డలు!

హత్యకు గల కారణం (Flashback)

ఏప్రిల్ 25వ తేదీన నిందితుడు జిత్తు సైనీ తన పుట్టినరోజు వేడుకలను ఒక జిమ్‌లో.. ఆ తర్వాత ఇంటి వద్ద జరుపుకున్నాడు. అయితే జిమ్ములో బర్త్ డే చేసుకుంటుండగా.. 30 ఏళ్ల అమర్‌దీప్, 28 ఏళ్ల మనీష్, 18 ఏళ్ల ఆకాష్ అనే ముగ్గురు యువకులు సరదాగా జిత్తు సైనీ ముఖానికి కేక్ పూశారు. ఈ చిన్నపాటి చిలిపి చేష్టను జిత్తు సైనీ తీవ్ర అవమానంగా భావించాడు. అక్కడికక్కడే వారితో గొడవ పడి వెళ్లిపోయాడు. కానీ కాసేపటికే, అన్నాదమ్ములైన ఈ ముగ్గురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

 Bulandshahr Encounter

UP Crime: ఎన్‌కౌంటర్ వివరాలు

ఈ ఘోరానికి పాల్పడిన తర్వాత జిత్తు సైనీ పరారయ్యాడు. కానీ కాల్పుల శబ్దంతో అక్కడకు చేరుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పై సీసీటీవీ ఫుటేజీ ద్వారా జిత్తు సైనీయే నిందితుడిని తెలుసుకున్నారు.ఈ క్రమంలో, గురువారం తెల్లవారుజామున ఝాజర్ రోడ్డులో పోలీసులకు, నిందితులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

నిందితుడు జీతూ సైనీపై పోలీసులు రూ. 50,000 రివార్డు ప్రకటించారు.తనిఖీల సమయంలో పోలీసులపై కాల్పులు జరిపి పారిపోతుండగా, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో జీతూ గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.ఘటనా స్థలం నుండి ఒక పిస్టల్, బుల్లెట్లు, నంబర్ ప్లేట్ లేని స్కూటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

బీజేపీ నేత వెంకటేశ్ కురుబర హత్య కేసు: ఆరుగురికి మరణశిక్ష

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha