Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబాలకు రూ.కోటి భరోసా

ఆర్టీసీ డ్రైవర్ల కుటుంబాలకు రూ.కోటి భరోసా

వార్త 2 weeks ago

RTC Road Accident : తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోడ్డు ప్రమాదాల్లో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ఇద్దరు డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున ప్రమాద బీమా సాయం అందజేశారు.

పికెట్ డిపోకు చెందిన శ్రీనివాసరెడ్డి, పరిగి డిపోకు చెందిన సుధాకర్ రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. ఈ క్లిష్ట సమయంలో ఉచిత ప్రమాద బీమా పథకం ద్వారా వారికి ఆర్థిక భరోసా కల్పించారు.

సూపర్ సాలరీ సేవింగ్ ఖాతాతో లభించిన బీమా

సంస్థ ఉద్యోగుల కోసం యూనియన్ బ్యాంక్ అందిస్తున్న సూపర్ సాలరీ సేవింగ్ ఖాతా ఈ సమయంలో ఎంతో ఉపయోగపడింది. ఈ ఖాతా కలిగిన ఉద్యోగులకు ఉచిత ప్రమాద బీమా సౌకర్యం వర్తిస్తుందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో మరణించిన ఇద్దరు డ్రైవర్ల కుటుంబాలకు కోటి రూపాయల విలువైన చెక్కులను టీజీఎస్ ఆర్టీసీ వీసీ మరియు ఎండీ వై నాగిరెడ్డి, యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులతో కలిసి బస్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు.

Read Also : ORRపై విషాదం.. కంటైనర్‌ను ఢీకొట్టిన డీసీఎం, ఒకరు మృతి!

 RTC Road Accident RTC Road Accident RTC Road Accident

ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యమన్న నాగిరెడ్డి

ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి సంస్థ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. కుటుంబంలో పెద్ద దిక్కును కోల్పోయిన వారికి ఈ బీమా సౌకర్యం ఎంతో మేలు చేస్తుందని పేర్కొన్నారు. అపద సమయంలో ఇలాంటి పథకాలు ఎంత ముఖ్యమో ఈ ఘటన మరోసారి నిరూపించిందన్నారు. ఉద్యోగులు ఆర్థిక భద్రత కలిగిన పథకాలపై నిర్లక్ష్యం చూపకూడదని సూచించారు. ఈ అవకాశాన్ని కల్పించిన యూనియన్ బ్యాంక్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

తెలంగాణ లోని ఆ నాల్గు జిల్లాలకు రెడ్ అలర్ట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha