Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్టీసీ కార్మికులకు సీఎం గుడ్‌న్యూస్..పెరిగిన వేతనాలు!

ఆర్టీసీ కార్మికులకు సీఎం గుడ్‌న్యూస్..పెరిగిన వేతనాలు!

వార్త 3 months ago

TGRTC Wages Update: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కార్మికులు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం మరియు యాజమాన్యం తీపి కబురు అందించాయి.

ఆర్టీసీ యాజమాన్యం, ఉద్యోగ సంఘాల జేఏసీ (JAC) నాయకుల మధ్య గురువారం జరిగిన కీలక చర్చలు పూర్తిగా సఫలమయ్యాయి. ఆర్టీసీ కార్మికులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న వేతన సవరణ (PRC), అలవెన్సుల పెంపు, కారుణ్య నియామకాల క్రమబద్ధీకరణ వంటి పలు ప్రధాన డిమాండ్లపై యాజమాన్యం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

11 శాతం ఫిట్‌మెంట్‌తో వేతన సవరణ

ఆర్టీసీ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ 2021 వేతన సవరణను 11 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేసేందుకు యాజమాన్యం అధికారికంగా అంగీకరించింది. ఈ పెంచిన నూతన వేతనాలను ఈ ఏడాది జూలై 1 నుంచి ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్ సిబ్బంది మరియు అధికారులకు భారీ ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.

 Successful RTC talks.. Allowances increased to 80 percent.. Key decision on compassionate appointments

TGRTC Wages Update: అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్ 80 శాతానికి పెంపు

వేతన సవరణతో పాటు 2017 నాటి అలవెన్సులు, ఫ్రింజ్ బెనిఫిట్స్‌ను ఏకంగా 80 శాతానికి పెంచి ఇవ్వడానికి ఆర్టీసీ ఉన్నతాధికారులు సమ్మతించారు. దీనితో పాటు సంస్థలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల (Compassionate Appointments) క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా వేగవంతం చేయనున్నట్లు చర్చల్లో హామీ ఇచ్చారు. ఎట్టకేలకు తమ న్యాయమైన డిమాండ్ల సాధనపై యాజమాన్యం సానుకూలంగా స్పందించడం పట్ల టీజీ ఆర్టీసీ జేఏసీ నాయకులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై బీఆర్‌ఎస్ నిరసన ధర్నా

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha