అంబేద్కర్ సర్కిల్ వద్ద బీఆర్‌ఎస్ ధర్నా
ప్రభుత్వాలపై బీఆర్‌ఎస్ నేతల ఆగ్రహం
BRS protest : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు.
పెరుగుతున్న ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నేతలు పేర్కొన్నారు.
Read also : Palamuru Rangareddy Project: పాలమూరు ప్రాజెక్టు ఆపేది లేదు:ఉత్తమ్
BRS protestవెంటనే పెట్రోల్, డీజిల్ ధరల పెంపును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. దేశంలోని కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో ప్రజలపై అదనపు భారం పడుతోందని మండిపడ్డారు. సామాన్యుల నడ్డివిరిచే విధంగా ధరల పెంపులు కొనసాగుతున్నాయని విమర్శించారు. ప్రజల సమస్యలను గుర్తించి తక్షణమే ధరలను తగ్గించాలని బీఆర్‌ఎస్ నాయకులు కోరారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

