TGSRTC: దసరా పండుగ వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) తమ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. అర్హులైన సిబ్బందికి పండుగ అడ్వాన్స్ మంజూరు చేస్తూ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది.
TGSRTC దసరా అడ్వాన్స్ విశేషాలు
అర్హత మరియు చెల్లింపు విధానం
సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ (MD) నాగిరెడ్డి ఆదేశాల మేరకు, క్లాస్ 3 మరియు క్లాస్ 4 స్థాయికి చెందిన అర్హులైన ఉద్యోగులందరికీ ఈ పండుగ అడ్వాన్స్ అందించనున్నారు. ఈ మొత్తాన్ని అనుబంధ వేతన బిల్లు (Supplementary Pay Bill) ద్వారా తక్షణమే చెల్లించాల్సిందిగా సంబందిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

TGSRTC: వడ్డీ రహిత వాయిదాల సదుపాయం
ఉద్యోగులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు యాజమాన్యం ఒక ముఖ్యమైన వెసులుబాటు కల్పించింది. ఈ అడ్వాన్స్ మొత్తాన్ని ఎలాంటి వడ్డీ లేకుండా రికవరీ చేయనున్నారు. తీసుకున్న అప్పును 10 సమాన నెలవారీ వాయిదాల (EMI) పద్ధతిలో ఉద్యోగుల వేతనాల నుండి ప్రతినెలా క్రమంగా జమ చేసుకుంటారు.
Read aslo:
నేడే సద్దుల బతుకమ్మ వేడుకలు..సద్దుల బతుకమ్మకు ఆ పేరెలా వచ్చింది?

