Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆర్టీసిలో ఖాళీగా ఉన్న డ్రైవర్లు, కండక్టర్ల పోస్టుల భర్తీ :మండిపల్లి రాంప్రసాదెడ్డి

ఆర్టీసిలో ఖాళీగా ఉన్న డ్రైవర్లు, కండక్టర్ల పోస్టుల భర్తీ :మండిపల్లి రాంప్రసాదెడ్డి

వార్త 2 months ago

APSRTC Jobs: ఏపీఎస్ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న డ్రైవర్లు, కండక్టర్లు, మెకానిక్స్ తదితర పోస్టులకు ప్రాధాన్యతతో భర్తీ చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

వివిధ విభాగాల్లో 7,673 పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి కోరాలని మంత్రి, సూచించారు. ప్రాధాన్యత క్రమంలో పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు. 2020లో ఆర్టీసీలో 51,488 మంది ఉద్యోగులు ఉండగా ప్రస్తుతం 44,131 మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. రానున్న 3 ఏళ్లలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు రిటైర్ కానున్నందున ఉద్యోగుల భర్తీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు.

Read also: Nara Lokesh Education Review: ప్రభుత్వ బడుల్లో 5 స్టార్ సౌకర్యాలు

Preparations Underway to Fill 7,673 Jobs in the RTC

APSRTC Jobs: ఒక్కో ఉద్యోగికి రూ.15 లక్షలు

ఆదేవిధంగా ఉద్యోగుల ప్రమోషన్లు, బకాయిల చెల్లింపులు, నియామకాలు, వైద్య కారణాలతో రిటైర్ అయిన ఉద్యోగుల సమస్యలు, కారుణ్య నియామకాలు, సీనియారిటీ జాబితాలు, కోర్టు కేసుల స్థితిగతులపై అధికారులకు మంత్రి పలు సూచనలు చేశారు. వైద్య కారణాలతో రిటైర్ అయిన ఉద్యోగుల గురించి చర్చించారు. 2020 జనవరి నుంచి వైద్య కారణాలతో 682 మంది ఉద్యోగులు రిటైర్ అయినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 36 మందికి ప్రత్యామ్నాయ ఉద్యోగం, మిగిలిన 646 మంది ఉద్యోగులకు ఆర్ధిక పరిహారం చెల్లించాల్సి ఉందని వివరించారు.

మెడికల్ రిటైర్మెంట్ ఉద్యోగులకు భారీ ఆర్థిక సాయం

ఒక్కో ఉద్యోగికి రూ.15 లక్షలు ఇలా ఒక్కో ఉద్యోగికి రూ.15 లక్షల చొప్పున మొత్తం ఆర్థిక భారం 96.90 కోట్ల రూపాయులు చెల్లించాల్సి ఉందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ అధికారులకు వివరించారు. అలాగే సీనియారిటీ జాబితాల ఆధారంగా డీపీసీలు నిర్వహించేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. కోర్టు కేసుల స్థితిగతులపై అధికారుల నుంచి నివేదిక తీసుకున్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి త్వరిత చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

ఈత సరదా తెచ్చిన ముప్పు.. లోతైన బావిలో మునిగి ఇద్దరు మృత్యువాత!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha