Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఈత సరదా తెచ్చిన ముప్పు.. లోతైన బావిలో మునిగి ఇద్దరు మృత్యువాత!

ఈత సరదా తెచ్చిన ముప్పు.. లోతైన బావిలో మునిగి ఇద్దరు మృత్యువాత!

వార్త 2 months ago

SriKalahasti Crime: శ్రీకాళహస్తి మండలంలో జరిగిన ఈ విషాదకర ఘటన ఈత సరదా ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో మరోసారి గుర్తుచేస్తోంది. ఒక ప్రాణాన్ని కాపాడబోయి మరొకరు కూడా ప్రాణాలు కోల్పోవడం ఆ గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Read Also:Uttar Pradesh Crime: బిచ్చగాడిని చంపి తాను చనిపోయినట్లు నమ్మించిన కానిస్టేబుల్

SriKalahasti Crime: అసలేం జరిగిందంటే?

అరవకొత్తూరు గ్రామానికి చెందిన త్రిశూల్ (12) అనే బాలుడు స్థానిక పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం ఉదయం తన స్నేహితులతో కలిసి గ్రామంలోని ఒక వ్యవసాయ బావి వద్దకు ఈత నేర్చుకోవడానికి వెళ్లాడు. ఈత రాకపోయినా, ఉత్సాహంతో బావిలోకి దూకాడు. అయితే బావి లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగిపోతూ ప్రాణభయంతో కేకలు వేశాడు.

 SriKalahasti drowning incident Aravakottur

అతడి అరుపులు విని సమీపంలో ఉన్న తరుణ్ రెడ్డి అనే యువకుడు వెంటనే స్పందించి, త్రిశూల్‌ను కాపాడేందుకు బావిలోకి దూకాడు. కానీ, దురదృష్టవశాత్తు లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.మృతులను త్రిశూల్ (12), తరుణ్ రెడ్డి (25)గా గుర్తించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

ఇన్‌స్టాగ్రామ్ స్నేహం: ఇల్లు వదిలి వెళ్ళిన చిత్తూరు బాలికల ఆచూకీ లభ్యం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha