Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసక్తికరమైన థియేట్రికల్ 'నాగబంధం' ట్రైలర్ విడుదల

ఆసక్తికరమైన థియేట్రికల్ 'నాగబంధం' ట్రైలర్ విడుదల

వార్త 2 weeks ago

Nagabandham Movie Trailer: యువ హీరో విరాట్ కర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మైథలాజికల్ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం 'నాగబంధం - ది సీక్రెట్ ట్రెజర్'.

టాలీవుడ్‌లో భారీ అంచనాలున్న ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని ప్రసాద్స్ పీసీఎక్స్ మల్టీప్లెక్స్‌లో నిర్వహించిన ఓ గ్రాండ్ ఈవెంట్‌లో ఘనంగా విడుదల చేశారు. ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా స్వయంగా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం.. ట్రైలర్ విడుదల తర్వాత సినీ ప్రేక్షకుల్లో అంచనాలను స్కై హైకి తీసుకెళ్లింది.

ప్రాచీన విష్ణు ఆలయాల రహస్యాల నేపథ్యంలో సాగే అద్భుతమైన కథాంశంతో ఈ చిత్రం తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా స్పష్టమవుతోంది. ‘నాగబంధం’ అనే అత్యంత రహస్యమైన ఆధ్యాత్మిక ఆచారాన్ని, దాని చుట్టూ జరిగే ఒక నిధి అన్వేషణను ట్రైలర్‌లో అత్యంత ఆసక్తికరంగా చూపించారు. కథలో భాగంగా వచ్చే బ్రహ్మ కమలం, అనంత పద్మనాభ స్వామి ఆలయం వంటి అంశాలు సినిమాపై క్యూరియాసిటీని రేకెత్తిస్తున్నాయి. భారీ విజువల్స్, యుద్ధ కవచాలు ధరించిన ఏనుగులు, హాలీవుడ్ స్థాయి వీఎఫ్‌ఎక్స్ శ్రేష్ఠత ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి.

Read Also : James Burrows:ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ బరోస్ కన్నుమూత

 Intriguing theatrical trailer of ‘Nagabandham’ released.

Nagabandham Movie Trailer: జూలై 3న పాన్ ఇండియా రిలీజ్

అభిషేక్ పిక్చర్స్, ఎన్ఐకే స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా ఎక్కడా రాజీ పడకుండా సుమారు రూ. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ విజువల్ వండర్‌ను నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంలో విరాట్ కర్ణకు జోడీగా టాలీవుడ్ గ్లామర్ డాల్స్ నభా నటేష్, ఐశ్వర్య మీనన్ నటిస్తున్నారు. అలాగే టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు, బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్, రిషభ్ సాహ్నీ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా, ఇప్పటికే విడుదలైన ‘వరల్డ్ ఆఫ్ నాగబంధం’ టీజర్‌కు యూట్యూబ్‌లో 35 మిలియన్లకు పైగా వ్యూస్ రావడం విశేషం. భారీ విజువల్ ఎఫెక్ట్స్‌తో, మైథలాజికల్ టచ్‌తో వస్తున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ చిత్రం ఒక సరికొత్త థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించడానికి సిద్ధమైంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ ఎత్తున విడుదల కానుంది. సినిమాటోగ్రఫీ, గ్రాఫిక్స్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ట్రైలర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కార్తికేయ-2 తరహాలోనే ప్రాచీన భారతీయ సంస్కృతి, దేవాలయాల రహస్యాల చుట్టూ తిరిగే ఈ కథ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో చూడాలి.

లేటు వయసులో ఘాటు ప్రేమ.. ప్రముఖ శాస్త్రవేత్తను పెళ్లాడిన 'లగాన్' నటి

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha