Suhasini Mulay Marriage: 'లగాన్', 'జోధా అక్బర్' వంటి విలక్షణమైన చిత్రాలతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సుహాసిని ములే జీవితం ఒక సినిమా కథను తలపిస్తుంది.
సమానత్వం అంటే ఏమిటో నిజంగా అర్థం చేసుకునే వ్యక్తి దొరకకపోవడంతోనే, ఆమె ఇన్నాళ్లూ ఎవరితోనూ జీవితాన్ని పంచుకోకుండా ఒంటరిగా ఉండిపోయారు. మరీ ఎక్కువ మతపరమైన భావాలు లేని, భిన్నమైన జీవనశైలి కలిగిన వ్యక్తుల పట్ల విమర్శనాత్మక దృక్పథం చూపని ఒక తోడు కోసం ఆమె సుదీర్ఘకాలం ఎదురుచూశారు. చివరికి 60 ఏళ్ల వయసులో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైన ఒక ప్రముఖ శాస్త్రవేత్తతో ఆమె ప్రేమలో పడి, వివాహం చేసుకున్నారు.
సుహాసిని తన వివాహ బంధం వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. “నేను 60 ఏళ్ల వయసులో మొదటిసారి వివాహం చేసుకున్నాను. అంతకుముందు వరకు నాకు సరైన జోడీ దొరకలేదు. తాను దశాబ్దాల పాటు ఒంటరిగా ఉండటానికి కారణం వివాహ ప్రతిపాదనలు లేకపోవడం కాదని సుహాసిని స్పష్టం చేశారు. తన ఆలోచనలకు, ఆత్మగౌరవానికి సరిపోయే సరైన భాగస్వామి దొరకకపోవడమే అందుకు కారణమని ఆమె పేర్కొన్నారు. సమానత్వం, పరస్పర గౌరవం లేని బంధంలో రాజీ పడకూడదనే ఉద్దేశంతోనే తాను 60 ఏళ్ల వయసు వచ్చే వరకు వేచి చూశానని ఆమె ఆత్మవిశ్వాసంతో వెల్లడించారు.
Read Also : Sandhya Theater Stampede Case : కోర్టుకు రావాల్సిందే.. అల్లు అర్జున్ కు కోర్ట్ ఆదేశం
A passionate romance in later life… 'Lagaan' actress marries prominent scientist.
ఈ అరుదైన ప్రేమకథ ఒక సామాజిక మాధ్యమం ద్వారా ప్రారంభమవడం విశేషం. వృత్తిపరమైన పరిచయాల కోసం తోటి నటుడి సలహాతో సుహాసిని ఫేస్‌బుక్‌లో చేరారు. అక్కడ స్విట్జర్లాండ్‌లోని ప్రసిద్ధ 'సెర్న్' (CERN) ల్యాబ్‌లో లార్జ్ హాడ్రాన్ కొలైడర్ ప్రాజెక్టులో పనిచేసిన ప్రసిద్ధ అణు భౌతిక శాస్త్రవేత్త (న్యూక్లియర్ ఫిజిసిస్ట్) అతుల్ గుర్తూ ప్రొఫైల్ ఆమెను ఆకర్షించింది. అలా వారిద్దరి మధ్య ఆన్‌లైన్ చాటింగ్ క్రమంగా పెరిగింది.
Suhasini Mulay Marriage: కేవలం 75 రోజుల్లోనే మూడు ముళ్లు!
ఆన్‌లైన్ పరిచయం బలపడ్డాక, వారిద్దరూ మొదటిసారి ప్రత్యక్షంగా కలుసుకున్నారు. ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత, ఎలాంటి ఆడంబరాలు లేకుండా కేవలం 75 రోజుల పరిచయంతోనే ఆర్య సమాజ్ ఆలయంలో అత్యంత సాదాసీదాగా వివాహం చేసుకున్నారు. 60 ఏళ్ల వయసులో తనకు తోడు దొరకడంపై మొదట్లో తనకే కొన్ని సందేహాలు ఉన్నప్పటికీ, అతుల్ పరిచయం తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని సుహాసిని ఆనందం వ్యక్తం చేశారు.
జాతీయ అవార్డు గ్రహీత అయిన సుహాసిని తీసుకున్న ఈ సాహసోపేత నిర్ణయానికి ఆమె తల్లి, ప్రముఖ మహిళా దర్శకురాలు విజయ ములే పూర్తి మద్దతునిచ్చారు. సమాజం, బంధువులు తొలుత ఆశ్చర్యం వ్యక్తం చేసినప్పటికీ, ఆమె మాత్రం ఎప్పుడూ లోకాచారాల కంటే తన అంతరాత్మ ప్రబోధానికే ప్రాధాన్యం ఇచ్చారు. ప్రస్తుతం 75 ఏళ్ల వయసులో ఉన్న సుహాసిని ములే, అతుల్ గుర్తూల వైవాహిక బంధం విజయవంతంగా 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ తాజా ఇంటర్వ్యూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, నెటిజన్లు ఈ ఆదర్శ జంటపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also :

