Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి సస్పెండ్!

ఆసిఫాబాద్ జిల్లాలో పంచాయతీ కార్యదర్శి సస్పెండ్!

వార్త 1 week ago

Asifabad Collector Haritha: కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఓ పంచాయతీ కార్యదర్శిపై సస్పెన్షన్ వేటు పడింది.

విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినా, నిధుల దుర్వినియోగానికి పాల్పడినా సహించేది లేదని జిల్లా కలెక్టర్ కె. హరిత ఆదివారం ఒక ప్రకటనలో హెచ్చరించారు.

తీర్మానం, ఆమోదం లేకుండా నిధుల విత్‌డ్రా

దహేగాం మండలం బిబ్రా గ్రామపంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్‌లు తమ పంచాయతీ కార్యదర్శి డి. సుమలతపై జిల్లా కలెక్టర్‌కు అధికారికంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేపట్టారు.

ఈ విచారణలో పంచాయతీ కార్యదర్శి సుమలత గ్రామపంచాయతీ కనీస తీర్మానం లేకుండా, అలాగే సర్పంచ్, ఉప సర్పంచ్‌ల ఎలాంటి ఆమోదం తీసుకోకుండా నిబంధనలకు విరుద్ధంగా రూ. 1,02,297 నిధులను డ్రా చేసినట్లు రుజువైంది. వీటితో పాటు పంచాయతీకి సంబంధించిన ఇతర ఆర్థిక చెల్లింపుల్లోనూ ఆమె నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు.

Asifabad Collector Haritha: నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ హెచ్చరిక

ఆర్థిక అవకతవకల ఆరోపణలు నిజమని తేలడంతో పంచాయతీ కార్యదర్శి డి. సుమలతను తక్షణమే విధుల్లోంచి సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ కె. హరిత ప్రకటించారు. గ్రామపంచాయతీల్లో నిధుల చెల్లింపులు, ఖర్చులు అత్యంత పారదర్శకంగా జరగాలని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించినా, ప్రజలకు అందాల్సిన సంక్షేమ పథకాల అమలులో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా ఎంతటివారైనా సరే సహించేది లేదని, వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

ఇందిరమ్మ వరమిచ్చింది.. కరెంటు స్తంభం శాపమైంది!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha