Parveen Boxing: ఆసియా గేమ్స్ 2026లో భారత స్టార్ బాక్సర్ పార్వీన్ అద్భుత ప్రదర్శనతో సత్తా చాటింది. మహిళల 65 కేజీల విభాగం ఫైనల్ పోరులో చైనీస్ తైపీకి చెందిన చెన్ నియన్‌చిన్‌పై 3-2 స్ప్లిట్ డెసిషన్‌తో విజయం సాధించి స్వర్ణ పతకాన్ని (Gold Medal) కైవసం చేసుకుంది.
ఉత్కంఠభరితంగా సాగిన ఈ విజయం ఆసియా గేమ్స్ బాక్సింగ్ చరిత్రలో భారత్‌కు 13వ స్వర్ణ పతకం కావడం విశేషం.
Read Also :Lovlina Borgohain: ఆసియా క్రీడల్లో లవ్లీనా సత్తా.. 75 కిలోల్లో స్వర్ణం కైవసం
Parveen Boxing: ఉత్కంఠభరిత ఫైనల్ మ్యాచ్ & పార్వీన్ రిడీమ్‌షన్ స్టోరీ

మ్యాచ్ ఆరంభంలోనే రింగ్‌లో విజృంభించిన పార్వీన్, మొదటి రౌండ్‌ను ఐదుగురు జడ్జీల ఏకగ్రీవ తీర్పుతో 5-0తో కైవసం చేసుకుంది. రెండో రౌండ్‌లో చైనీస్ తైపీ బాక్సర్ చెన్ పుంజుకుని 5-0తో సమాధానమివ్వడంతో పోటీ ఇరు వర్గాల మధ్య తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. ఒత్తిడి తీవ్రంగా ఉన్న సమయాన మూడో రౌండ్‌లో పార్వీన్ తన అద్భుత పంచ్‌లతో పాయింట్లు రాబట్టింది. ముగ్గురు జడ్జీలు పార్వీన్‌కు అనుకూలంగా ఓటు వేయడంతో 3-2 స్ప్లిట్ డెసిషన్‌తో విజేతగా నిలిచింది. హాంగ్‌జౌ (2022) ఆసియా గేమ్స్‌లో కాంస్య పతకం సాధించినప్పటికీ, ఆ తర్వాత ఎదురైన సస్పెన్షన్ కారణంతో పతకాన్ని కోల్పోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఏకంగా స్వర్ణం సాధించి తనపై వచ్చిన విమర్శలన్నింటికీ బరిలోనే సమాధానం చెప్పింది.
వన్డే ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల.. ఒకే గ్రూప్‌లో భారత్-పాక్

