Vinesh Phogat: స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ మరోసారి వార్తల్లో నిలిచారు. గొండాలో జరుగుతున్న జాతీయ ఓపెన్ ర్యాంకింగ్ టోర్నమెంట్‌లో పాల్గొనకుండా తనపై భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) విధించిన అనర్హత వేటుపై ఆమె ఘాటుగా స్పందించారు.
ఈ నిర్ణయం వెనుక లోతైన కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.రాబోయే ఆసియా క్రీడల్లో తాను పాల్గొనకుండా అడ్డుకోవడమే WFI లక్ష్యమని, తనను కావాలనే టార్గెట్ చేసుకున్నారని ఆమె ఆరోపించారు. పారిస్ ఒలింపిక్స్‌లో ఎదురైన అనుభవం తర్వాత తన కుమారుడు క్రిధవ్ తనలో కొత్త ఉత్సాహాన్ని నింపాడని ఆమె పేర్కొన్నారు.
Read Also: Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ చిచ్చరపిడుగు.. సిక్సర్లే కాదు పుల్కాలు కూడా!
Vinesh Phogat WFI Disqualification
Vinesh Phogat: ఆసియా క్రీడల నుంచి తప్పించేందుకే ఈ చర్యలు?
తనపై వేసిన అనర్హత వేటుకు సంబంధించి నోటీసు అందిందని, 14 రోజుల గడువు ఇచ్చారని, ఈ లోపు తనను పోటీ చేయనివ్వాలని ఆమె విన్నవించారు. అయితే, ఈ అభ్యర్థనను సంజయ్ సింగ్ తోసిపుచ్చారు. పూర్తి వివరణ ఇచ్చిన తర్వాత కమిటీ నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు పోటీకి అనుమతించబోమని స్పష్టం చేశారు. “నేను మళ్లీ రింగులోకి వచ్చి పతకాలు సాధిస్తానని వారు భయపడుతున్నారు. నన్ను ఆసియా క్రీడల నుంచి తప్పించాలని, నేను రెజ్లింగ్ నుండి రిటైర్ అవ్వాలని వారు కోరుకుంటున్నారు. అందుకే సాంకేతిక కారణాలు చూపి నన్ను పక్కన పెడుతున్నారు” అని వినేశ్ ఘాటుగా వ్యాఖ్యానించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
https://vaartha.com/sports/lizloz-comments-on-virat-kohli-%e0%b0%95%e0%b1%8b%e0%b0%b9%e0%b1%8d%e0%b0%b2%e0%b1%80%e0%b0%aa%e0%b1%88-%e0%b0%85%e0%b0%ac%e0%b0%a6%e0%b1%8d%e0%b0%a7%e0%b0%be%e0%b0%b2%e0%b1%81-%e0%b0%9a%e0%b1%86/707374/

