మైదానంలో సిక్సర్లు.. కిచెన్‌లో పుల్కాలు
Vaibhav Suryavanshi: రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆటలోనే కాదు వంటలోనూ తన ప్రతిభను చాటుకున్నారు.
స్టేడియంలో బౌలర్ల బంతులను బౌండరీల బయటకు పంపే ఈ కుర్రాడు తాజాగా చెఫ్ అవతారం ఎత్తారు. సొంతంగా పుల్కాలు చేస్తూ అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి.
Read also: Telangana Premier League: వచ్చే నెలలో 'తెలంగాణ ప్రీమియర్ లీగ్'
Vaibhav Suryavanshi making hot rotis
Vaibhav Suryavanshi: మాస్టర్ చెఫ్ అవతారంలో వైభవ్
‘మాస్టర్ చెఫ్ వైభవ్’ అంటూ కిచెన్‌లో ఆయన చేసిన హడావిడి అభిమానులకు బాగా నచ్చింది. పిండి కలపడం దగ్గర నుండి పుల్కాలను కాల్చే వరకు ఎంతో నైపుణ్యంగా ఈ క్రికెటర్ పనులు చేశారు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ ఈ ఆసక్తికర వీడియోను షేర్ చేస్తూ వైభవ్ లోని మరో కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది.
నవ్వులు పూయించిన సరదా సంభాషణ
ఈ వీడియోలో వైభవ్ తోటి వారితో చేసిన సరదా వ్యాఖ్యలు నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. నా రోటీ తీసుకుంటున్నాడు అంటూ ఒకరు కంప్లైంట్ ఇవ్వడం అక్కడ నవ్వులు పూయించింది. ఆటతో పాటు తన పర్సనల్ లైఫ్ లోని ఇలాంటి చిన్న చిన్న ఆనందాలను వైభవ్ ఎంజాయ్ చేయడం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:

