Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన పీవీ సింధు

ఆసియా క్రీడల్లో క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన పీవీ సింధు

వార్త 3 weeks ago

PV Sindhu: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఆసియా క్రీడల్లో తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తోంది. మహిళల సింగిల్స్ విభాగంలో జరిగిన హోరాహోరీ పోరులో ఆమె అరివీర భీకర ప్రదర్శన కనబరిచి క్వార్టర్ ఫైనల్స్‌లోకి ప్రవేశించింది.

జపాన్‌కు చెందిన బలమైన క్రీడాకారిణి టొమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యం చెలలాయించి, 21-9, 21-13 తేడాతో స్ట్రెయిట్ గేమ్‌లలో సులువుగా విజయం సాధించింది.

దూకుడు ప్రదర్శించిన తెలుగు తేజం

మ్యాచ్ ప్రారంభం నుంచే సింధు ఎంతో దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. తొలి గేమ్‌లో జపాన్ షట్లర్‌కు ఎలాంటి అవకాశమూ ఇవ్వకుండా ఏకపక్షంగా 21-9 తేడాతో కైవసం చేసుకుంది. ఇక రెండో గేమ్‌లో మియాజాకి కాస్త ప్రతిఘటించేందుకు ప్రయత్నించినప్పటికీ, సింధు తన అద్భుతమైన అనుభవంతో సుదీర్ఘ ర్యాలీలను అధిగమించింది. విరామ సమయానికి ఆధిక్యంలో నిలిచిన సింధు, అదే జోరును ముగింపు వరకు కొనసాగించి 21-13తో మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుంది.

PV Sindhu: ఒకే రోజు రెండు విజయాలు నమోదు

ఈ మ్యాచ్‌కు ముందు అదే రోజు ఉదయం జరిగిన రెండో రౌండ్ పోరులోనూ సింధు అద్భుత ప్రతిభ కనబరిచింది. చైనీస్ తైపీ క్రీడాకారిణి చియు పిన్-చియాన్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో 21-19, 21-14 తేడాతో విజయం సాధించి ముందంజ వేసింది.

పతకం లక్ష్యంగా పట్టుదల

గత హ్యాంగ్జౌ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ దశలోనే నిష్క్రమించిన సింధు, ఈసారి ఎలాగైనా పతకం సాధించాలనే బలమైన పట్టుదలతో బరిలోకి దిగింది. ఇప్పటికే ఆసియా క్రీడల చరిత్రలో పతకాలు సాధించిన ఆమె, తాజా విజయాల జోరుతో దేశానికి మరో పతకాన్ని అందించే దిశగా వేగంగా అడుగులు వేస్తోంది.

నెట్ ప్రాక్టీస్‌లో కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు గాయం!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha