Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్కార్ రూల్స్ మార్చిన అకాడమీ.. AI క్రియేటివిటీకి చెక్!

ఆస్కార్ రూల్స్ మార్చిన అకాడమీ.. AI క్రియేటివిటీకి చెక్!

వార్త 1 month ago

99th Oscars: ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల నిర్వహణ సంస్థ (AMPAS), 99వ ఆస్కార్ వేడుక కోసం సరికొత్త నిబంధనలను ప్రకటించింది.

మారుతున్న కాలం, పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు అకాడమీ స్పష్టం చేసింది.

Read Also:LIK OTT Release: ప్రదీప్ రంగనాథన్ 'LIK' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్

99th Oscars: నటులకు డబుల్ ధమాకా.. కానీ ఒక కండిషన్!

ఇకపై ఒకే నటుడు ఒకే విభాగంలో ఒకటి కంటే ఎక్కువ సినిమాలకు నామినేషన్లు పొందే అవకాశం కల్పించారు. అయితే, ఆ ప్రదర్శనలు ఖచ్చితంగా రచయితలు రాసినదై ఉండాలి, నటుల అనుమతితో కూడిన ‘హ్యూమన్ పెర్ఫార్మెన్స్’ మాత్రమే అయి ఉండాలి. దీనివల్ల AI సాయంతో సృష్టించే డిజిటల్ పర్ఫార్మెన్స్‌లకు అకాడమీ చెక్ పెట్టింది.

 Oscars 2027 Rules

అంతర్జాతీయ సినిమాలకు ‘డైరెక్ట్ ఎంట్రీ’

గతంలో ఒక దేశం నుంచి ఒక సినిమా మాత్రమే ఆస్కార్‌కి పంపే వీలుండేది. కానీ ఇకపై కాన్స్, వెనిస్, టొరంటో వంటి మేజర్ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో అగ్ర అవార్డులు గెలిచిన సినిమాలు, ఆయా దేశాలు పంపకపోయినా నేరుగా ఆస్కార్ బరిలో నిలవవచ్చు. అంతేకాకుండా, బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ అవార్డును ఇకపై దేశం పేరు మీద కాకుండా నేరుగా దర్శకుడికే అందించనున్నారు.

సాంకేతిక, రచన విభాగాల్లో కూడా AI వినియోగంపై అకాడమీ కఠినంగా వ్యవహరించనుంది. స్క్రీన్ ప్లే ఖచ్చితంగా మనిషి మేధస్సు నుండి పుట్టిందే అయి ఉండాలని (Human-authored), AIని కేవలం ఒక సాధనంగా మాత్రమే వాడుకోవాలని నిబంధన విధించింది. సృజనాత్మకతలో మనిషి పాత్రను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.99వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం మార్చి 14, 2027న జరగనుంది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

నా భార్య నిప్పురా అంటూ హీరో బెల్లంకొండ ఆసక్తికర ట్వీట్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha