Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్తి కోసం కుట్ర.. రెండో భార్యతో కలిసి విషం పెట్టి చంపాలని ప్లాన్

ఆస్తి కోసం కుట్ర.. రెండో భార్యతో కలిసి విషం పెట్టి చంపాలని ప్లాన్

వార్త 2 months ago

Janagaon crime: మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో.. ఆస్తి పాస్తుల కోసం కన్న ప్రేగును కడతేర్చేందుకు కూడా వెనుకాడటం లేదు కొందరు. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బటి తండాలో ఇలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.

బానోత్ శ్రీనివాస్ అనే వ్యక్తి, తన మొదటి భార్య పిల్లలకు దక్కిన అర ఎకరం భూమిపై కన్నేశాడు. ఆ భూమిని కూడా తనకే దక్కించుకోవాలనే దురాశతో, తన రెండో భార్య మమతతో కలిసి ఇద్దరు పసిపిల్లలను హతమార్చాలని స్కెచ్ వేశాడు.

Read Also: Maharashtra crime: పరువు కోసం ప్రాణం తీశారు: ప్రియుడితో వెళ్లిన వివాహితకు విషమిచ్చి హత్య!

 Conspiracy for property.. plan to kill with poison a long with second wife

Janagaon crime: కుట్రను బయటపెట్టిన మధ్యవర్తి

పథకంలో భాగంగా శ్రీనివాస్ దంపతులు ఒక వ్యక్తిని సంప్రదించి, విషం కలిపిన బిస్కెట్లు పిల్లలకు తినిపిస్తే భారీగా డబ్బు ఇస్తామని ఆశ చూపారు. మొదట ఒప్పుకున్న ఆ వ్యక్తి, పసిపిల్లల ప్రాణాలు తీయడానికి భయపడి నేరుగా పిల్లల తల్లి అనితకు విషయం చెప్పేశాడు. తన పిల్లలకు ప్రాణాపాయం ఉందని గ్రహించిన అనిత వెంటనే పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఈ దారుణమైన కుట్ర బయటపడింది.

కటకటాల్లోకి కసాయి తండ్రి

అనిత ఫిర్యాదుతో రఘునాథపల్లి పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టి, ఈ హత్యాయత్నం కుట్ర నిజమేనని తేల్చారు. నిందితులు శ్రీనివాస్, అతని రెండో భార్య మమతను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆస్తి కోసం కన్న పిల్లలనే కాలయముడై వెంటాడిన తండ్రి తీరుపై తండా వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

జెస్సికా మృతి కేసులో సంచలన మలుపు.. సీసీ కెమెరాల డైరెక్షన్ మార్చి మరీ ప్లాన్?

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha