Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
పరువు కోసం ప్రాణం తీశారు: ప్రియుడితో వెళ్లిన వివాహితకు విషమిచ్చి హత్య!

పరువు కోసం ప్రాణం తీశారు: ప్రియుడితో వెళ్లిన వివాహితకు విషమిచ్చి హత్య!

వార్త 2 months ago

ద్యానికి బానిసైన భర్త వేధింపులు ఒకవైపు, ప్రాణంగా ప్రేమించిన వ్యక్తితో బతకాలని ఉన్న కోరిక మరోవైపు.. చివరకు ఆ వివాహిత ప్రాణాలనే బలి తీసుకున్నాయి.

తన కుటుంబ పరువును కాపాడుకోవడానికి కన్నవారే కాలయములై ఆమెకు విషం తాగించి చంపిన ఈ ఘటన సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేస్తోంది. సత్యవ్వ వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. అయితే ఆమె భర్త మద్యానికి బానిసై వేధిస్తుండటంతో, వివాహానికి ముందే పరిచయం ఉన్న కృష్ణ పాటిల్‌కు ఆమె మానసికంగా దగ్గరైంది. తన సమస్యల నుంచి విముక్తి లభిస్తుందన్న ఆశతో ఫిబ్రవరి 17న అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయింది.

Read Also: Bhadradri Kothagudem crime: ఇంట్లో ఉరివేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య

 Maharashtra crime

Maharashtra crime: కుటుంబ సభ్యుల మాయమాటలు.. దారుణ వ్యూహం

సత్యవ్వ అచూకీ కనుగొన్న కుటుంబ సభ్యులు, ఆమెను ఒప్పించి ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఇది ఆమెను రక్షించడానికి కాదు, శిక్షించడానికి అని ఆమె గ్రహించలేకపోయింది. ఆమెపై ఎవరికీ అనుమానం రాకుండా ఉండేందుకు మహారాష్ట్రలోని సరిహద్దు గ్రామాలకు ఆమెను తరలించారు. నిరంతరం ఆమెపై మానసిక ఒత్తిడి తెచ్చారు. కానీ సత్యవ్వ “కృష్ణతోనే ఉంటాను” అని ఖరాఖండిగా చెప్పడం వారి పాలిట పరువు సమస్యగా మారింది.

బలవంతంగా విషప్రయోగం

మార్చి 21న మేనమామ, సోదరుడు, బావ కలిసి ఆమెకు విషం తాగించి ప్రాణాలు తీశారు. రక్తపోటుతో మరణించిందని నమ్మబలికారు. హత్య చేసిన అనంతరం సాక్ష్యాధారాలు దొరకకుండా నిందితులు అత్యంత చాకచక్యంగా వ్యవహరించారు. రాత్రికి రాత్రే దహనం: zపోస్టుమార్టం చేస్తే విషం ఆనవాళ్లు దొరుకుతాయని భావించి, శ్మశానానికి తీసుకెళ్లి దహనం చేశారు. గ్రామస్తులకు అనుమానం రాకుండా లో-బీపీ (Low BP) కారణంగా ఆమె చనిపోయిందని అబద్ధాలు చెప్పారు. ఈ కేసులో టెక్నాలజీ కీలక పాత్ర పోషించింది. హత్య జరిగిన దాదాపు 20 రోజుల తర్వాత, ఏప్రిల్ 10న ఒక అజ్ఞాత వ్యక్తి కర్ణాటక పోలీస్ యాప్ ద్వారా సమాచారం అందించడంతో పోలీసులు లోతుగా విచారణ జరిపారు. ప్రియుడు కృష్ణ కూడా అనుమానం వ్యక్తం చేయడంతో నిందితులు దొరికిపోయారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

చాక్లెట్ ఇస్తానని నమ్మించి యాసిడ్ తాగించిన పిన్ని!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha