Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆస్తుల వివరాల్లో రూ.100 కోట్లు తేడా?

ఆస్తుల వివరాల్లో రూ.100 కోట్లు తేడా?

వార్త 2 months ago

విజయ్‌కు కోర్టు నోటీసులు

TVK Vijay affidavit case : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. 'తమిళగ వెట్రి కళగం' పార్టీ అధ్యక్షుడు మరియు ప్రముఖ నటుడు విజయ్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఎన్నికల అఫిడవిట్‌లో సమర్పించిన ఆస్తుల వివరాల్లో భారీ తేడాలు ఉన్నాయని ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకుంది.

ఆస్తుల వివరాల్లో వ్యత్యాసం

విజయ్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. పెరంబూర్ నియోజకవర్గంలో సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తుల విలువ రూ.115 కోట్లుగా పేర్కొన్నారు. అయితే తిరుచ్చి నియోజకవర్గంలో దాఖలు చేసిన పత్రాల్లో ఆస్తుల విలువ రూ.220 కోట్లుగా చూపించారు. ఈ రెండు వివరాల మధ్య రూ.100 కోట్లకు పైగా వ్యత్యాసం ఉండటం వివాదానికి దారితీసింది.

Read Also:All India Permit Cancelled: ఆల్ ఇండియా పర్మిట్ రద్దు చేసిన కేంద్రం!

 TVK Vijay affidavit case

కోర్టులో పిటిషన్

చెన్నైకి చెందిన వీవీ విఘ్నేశ్ ఈ అంశంపై మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. విజయ్ సమర్పించిన అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలపై స్పష్టత లేదని ఆయన ఆరోపించారు. దీనిని పరిశీలించిన న్యాయస్థానం విజయ్‌కు నోటీసులు జారీ చేసి ఆస్తుల తేడాకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

విజయ్ ఆధ్యాత్మిక పర్వం.. చర్చిలో మోకాళ్లపై నడిచి మొక్కులు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha