Bihar: బీహార్‌లోని పశ్చిమ చంపారణ్ జిల్లా, బగాహా సబ్ డివిజనల్ ఆసుపత్రిలో మానవ ప్రాణాలతో చెలగాటం ఆడే ఘటన వెలుగుచూసింది. ఇటీవల జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులు ఆసుపత్రికి రాగా, అక్కడ వారికి అత్యవసర చికిత్స అందించడానికి వైద్యులు లేదా నర్సులు అందుబాటులో లేరు.
ఈ క్రమంలో అక్కడే పనిచేస్తున్న ఒక సెక్యూరిటీ గార్డు నేరుగా మైనర్ ఆపరేషన్ థియేటర్ (OT)లోకి వెళ్లి రోగులకు కుట్లు వేయడం మొదలుపెట్టాడు. ఏమాత్రం వైద్య పరిజ్ఞానం లేని వ్యక్తి ఇలా వైద్యం చేయడం చూసి రోగులు, వారి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
Read Also: Vijay TVK:'విజిల్' గుర్తుకు ఓటు వేయండి - ఓటర్లకు దళపతి విజయ్ భావోద్వేగ విన్నపం!
Doctor turned security guard caught giving stitches to patients
Bihar: ప్రాణాల మీదకు తెస్తున్నారంటూ ఆగ్రహం
ప్రమాదంలో గాయపడిన వసీం అక్రమ్, సురేంద్ర పాసి అనే బాధితులు స్పందిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఆసుపత్రిలో వైద్యులు ఉన్నప్పటికీ, రద్దీ ఎక్కువగా ఉందనే నెపంతో తమను సెక్యూరిటీ గార్డుకు అప్పగించారని వారు వాపోయారు. “అసలు ఏమీ తెలియని వ్యక్తితో కుట్లు వేయించడం మా ప్రాణాల మీదకు తీసుకురావడమే” అని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ వివాదంపై ఆసుపత్రి డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్ కుమార్ తివారీ స్పందించారు. ఆసుపత్రిలో డ్రెస్సర్లు, ఓటీ అసిస్టెంట్ల పోస్టులు దీర్ఘకాలంగా ఖాళీగా ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. ప్రమాదం జరిగిన రోజు ఒక్కసారిగా ఆరుగురు బాధితులు రావడంతో, రక్తస్రావం ఆపడానికి వైద్యుడి పర్యవేక్షణలోనే గార్డు సహాయం తీసుకున్నామని ఆయన సమర్థించుకున్నారు. అయితే, ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులపై ఇలాంటి ప్రయోగాలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Read Also hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also:
హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేసిన ఇరాన్.. ఎల్పీజీ కి మళ్ళీ డిమాండ్

