Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆటో జేఏసీ నేతలతో మంత్రి పొన్నం వర్చువల్‌ సమావేశం

ఆటో జేఏసీ నేతలతో మంత్రి పొన్నం వర్చువల్‌ సమావేశం

వార్త 2 months ago

Ponnam Prabhakar: తెలంగాణలో తలపెట్టిన ఆటో బంద్ నేపథ్యంలో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆటో జేఏసీ (Auto JAC) నేతలతో వర్చువల్ విధానంలో మాట్లాడారు.

ఈ సమావేశంలో రవాణాశాఖ అధికారులతో పాటు ఆటో సంఘాల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. బంద్ వల్ల ప్రజలకు ఇబ్బందులు కలుగుతాయని, కాబట్టి తలపెట్టిన బంద్ నిర్ణయాన్ని విరమించుకోవాలని మంత్రి ఆటో నేతలను కోరారు.

రవాణాశాఖ కమిషనర్ తో కీలక చర్చలు

మంత్రి పొన్నం ప్రభాకర్ తో మాట్లాడేకంటే ముందు, రవాణాశాఖ కమిషనర్ ఇలంబర్తి ఆటో జేఏసీ నేతలతో ప్రత్యక్షంగా సమావేశమయ్యారు. రేపు ఆటోల బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో, వారి సమస్యలు మరియు డిమాండ్లపై ఈ భేటీలో కూలంకషంగా చర్చించారు. ప్రభుత్వ అధికారుల నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశం ఉండటంతో, బంద్ నిర్వహణపై చర్చలు కీలక దశకు చేరుకున్నాయి.

Ponnam Prabhakar: త్వరలోనే ఆటో జేఏసీ తుది నిర్ణయం

రవాణాశాఖ అధికారులు మరియు మంత్రి పొన్నం ప్రభాకర్‌తో జరిగిన వరుస చర్చల అనంతరం, ఆటో జేఏసీ నేతలు సమావేశమై తమ భవిష్యత్తు కార్యాచరణపై చర్చిస్తున్నారు. రేపు జరగాల్సిన ఆటో బంద్ ను కొనసాగించాలా వద్దా అనేదానిపై కాసేపట్లో ఆటో జేఏసీ నేతలు తమ అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు.

22A బాధితులకు హరీశ్‌రావు భరోసా.. న్యాయం జరిగే వరకు పోరాటం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha