Dailyhunt
ఆటోను ఢీకొన్న బైకు ఒకరికి తీవ్ర గాయాలు

ఆటోను ఢీకొన్న బైకు ఒకరికి తీవ్ర గాయాలు

వార్త 1 week ago

Medak Road Accident: బైకును అతివేగముగా నడుపుతూ మెదక్ జిల్లా కౌడిపల్లి గ్రామ బట్టెమ్మ దేవాలయ సమీపంలోని సామాజిక అటవీ పెంపకం ప్లాంటేషన్ వద్ద ఆటోని పోవర్టేట్ చేయబోతుండగా ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి వెనుక నుండి ఆటోని ఢీ కొన్నాడు ఈ రోడ్డు ప్రమాదంలో బైక్ నడుపుతున్న వ్యక్తి ఎడమ కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి వివరాలకు వెళ్తే..

వెల్దుర్తి మండలం అందుల పల్లి గ్రామానికి చెందిన దినకర్ ఏడుపాయల వనదుర్గ మాత ఆలయం వద్ద ఫంక్షన్ హాల్ను అద్దెకు బుక్ చేయడానికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అటుగా వెళుతున్న ప్రయాణికులు 108 అంబులెన్స్ కి సమాచారం అందించడంతో క్షతగాత్రుని చికిత్స నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha