Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కి బిల్ కలెక్టర్ అరెస్ట్

లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కి బిల్ కలెక్టర్ అరెస్ట్

వార్త 1 month ago

ACB Raids Sadasivapet: లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ సదాశివపేట బిల్ కలెక్టర్… అవినీతి పాలనలో నెంబర్ వన్ అనిపించుకుంటున్న సదాశివపేట మున్సిపాలిటీ..

ఎన్నిసార్లు ఏసీబీ అధికారులకు పట్టుబడిన మారని అధికారుల పనితీరు.. అందుకేనేమో సమావేశాలకు మీడియాను కూడా అనుమతించని కమిషనర్….. సదాశివపేట మున్సిపాలిటీలో అవినీతి రాజ్యమేలుతోంది.. ఇక్కడ అధికారుల పనితీరు అస్తవ్యస్తంగా ఉంటుంది. వారు చేసేదే చట్టం. వారు చెప్పిందే శాసనం అన్నట్లుగా ఇక్కడి అధికారుల పాలన ఉంటుంది. లంచాలకు అలవాటు పడిన అధికారులు క్రింది స్థాయి ఉద్యోగులను అడ్డుపెట్టుకొని వారు దొరకకుండా క్రింది స్థాయి ఉద్యోగులను బలి చేయుచున్నారు అని వాదనలు వినిపిస్తున్నాయి.

Read Also:Nalgonda crime: విధే వెక్కిరించింది.. కొడుకు మార్కులు చూసి మురిసిపోయేలోపే కన్నవారికి కడుపుకోత!

ACB Raids Sadasivapet: బిల్ కలెక్టర్ అఖిల్ రెడ్డి అరెస్ట్: అసలేం జరిగింది?

సదాశివపేట మున్సిపాలిటీలో ఇంటి పనులు కానీ వ్యాపార లైసెన్సులు కానీ ఒక పద్ధతి ప్రకారం కాకుండా ఇచ్చినోడికి ఒక విధంగా ఇవ్వనుడికి మరో విధంగా విదిస్తుంటారని పలువురు ఆరోపిస్తున్నారు. విధించిన పన్నును తగ్గించడానికి లంచం డిమాండ్ చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలలోకి వెళితే ఒక బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు లంచం తీసుకుంటున్న వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామని ఏసీబీ డిఎస్పి సుదర్శన్ రెడ్డి తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం బాధితుడు గతంలో 40 వేల పైచిలుకు రూపాయలను హౌస్ టాక్స్ కట్టాలని అధికారులు తెలిపారని, అది ఏకంగా ఒక్క లక్షల నాలుగు వేల రూపాయలకు పెంచారని బాధితుడు తెలిపినట్లు సుదర్శన్ రెడ్డి అన్నారు.

ఈ విషయమై బాధితుడు మున్సిపల్ కమిషనర్ను సంప్రదించగా కమిషనర్ సంబంధిత అధికారులకు విచారించమని ఆదేశించినట్లు తెలిపాడు. ఇంటి టాక్స్ ముందుగా ఉన్న 40 వేల రూపాయలకు చేయాలి అంటే 35000 లంచం ఇవ్వాలని బిల్ కలెక్టర్ నిఖిల్ రెడ్డి అడగగా 20 వేల రూపాయలు వెంటనే ఇచ్చాడని, మిగతా పదిహేను వేల రూపాయలను ఈరోజు నిఖిల్ రెడ్డికి ఇస్తుండగా రెడ్ హేండెడ్గా పట్టుకున్నామని డీఎస్పీ సుదర్శన్ రెడ్డి తెలిపారు.

ఈ విషయంలో పై అధికారుల పాత్ర ఉన్నా లేకున్నా మాకు లభించిన ఆధారాల ప్రకారం చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు. ఏది ఏమైనా పేదవాడిని పీడిస్తూ, ఉన్నవాడికి లాభాలను కలగజేస్తున్న అధికారుల బాగోతం ఏదో ఒక రోజు బయటపడుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు లోతుగా పరిశీలిస్తే సదాశివపేట మున్సిపాలిటీలో ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ తమ జేబులు నింపుకుంటున్న అవినీతి అధికారులు బండారం బయటపడుతుందని అది ఏసీబీ అధికారుల వల్లే సాధ్యమవుతుందని ప్రజలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

తెలంగాణ లో రూ.7,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మోడీ శంకుస్థాపన

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha