Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆయిల్‌ఫెడ్ భూమిని కాపాడండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

ఆయిల్‌ఫెడ్ భూమిని కాపాడండి.. సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు లేఖ

వార్త 3 weeks ago

Harish Rao: తెలంగాణలో ప్రభుత్వ భూముల కేటాయింపు అంశం మరోసారి రాజకీయ వివాదానికి దారితీసింది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలోని తెలంగాణ స్టేట్ ఆయిల్ ఫెడరేషన్‌కు చెందిన విలువైన భూములను కాపాడాలని కోరుతూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ఒక లేఖ రాశారు.

ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేసిన ఆయన, ప్రజా సంక్షేమాన్ని విస్మరించి కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ఏజెంట్‌లా వ్యవహరిస్తోందని ఘాటు విమర్శలు గుప్పించారు.

ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తున్నారంటూ తీవ్ర ఆరోపణలు

ఆయిల్ ఫెడ్‌కు చెందిన కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించేందుకు కుట్ర పన్నుతోందని హరీశ్ రావు ఆరోపించారు. మార్కెట్లో దాదాపు రూ. 500 కోట్ల వరకు విలువ చేసే సుమారు 3.23 ఎకరాల భూమిని కేవలం రూ. 87 కోట్లకే కట్టబెట్టాలని చూస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను రక్షించాల్సిన బాధ్యత పాలకులపై ఉంటూ, ఇలా కారుచౌకగా కట్టబెట్టడం అత్యంత దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

Harish Rao: ఆయిల్ ఫెడ్‌కే భూమి దక్కేలా చూడాలని విజ్ఞప్తి

ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని ఈ భూమి పూర్తిగా ఆయిల్ ఫెడ్ సంస్థకు మాత్రమే చెందేలా చర్యలు తీసుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. రైతులు, సంస్థల ప్రయోజనాలను కాపాడాల్సిన ప్రభుత్వం ఇలాంటి వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడం తగదన్నారు. ఇప్పటికే జరిగిన ఈ అక్రమ భూ కేటాయింపుల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేయాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Epaper: epaper.vaartha.com

హరీశ్ రావుపై మంత్రి పొంగులేటి ఫైర్

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha