KPHB Woman Death: హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ (KPHB) లో తీవ్ర కలకలం రేపిన విషాద ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడితో ఏర్పడిన సన్నిహిత పరిచయం అనంతరం గర్భం దాల్చిన 30 ఏళ్ల యువతి, గర్భాన్ని తొలగించేందుకు తీసుకున్న మాత్రలు వికటించడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 14న ఆమె తుదిశ్వాస విడిచింది. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు, నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు
Read Also : Miyapur News: వృద్ధ తల్లిదండ్రుల ధర్నా.. కొడుకు, కోడలిపై ఆరోపణలు
Young woman dies after abortion pills cause complications; boyfriend arrested.
KPHB Woman Death: పెళ్లయిన విషయం దాచి మోసం
ఆంధ్రప్రదేశ్ రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువతి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి, కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేట్ ల్యాబ్‌లో గత 6 నెలలుగా పనిచేస్తోంది. ఈ క్రమంలో సర్దార్ పటేల్‌నగర్‌లోని ఓ హాస్టల్‌లో నివసిస్తున్న ఆమెకు, తన ఫ్రెండ్ వెంకట్ ద్వారా కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలానికి చెందిన ఆరెపు నాగసాయి (26)తో పరిచయం ఏర్పడింది. నాగసాయికి అప్పటికే పెళ్లయి ఓ కుమార్తె ఉన్నప్పటికీ, ఆమెతో సన్నిహితంగా మెలిగాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చడంతో గర్భాన్ని తొలగించేందుకు ఆమెకు కొన్ని అబార్షన్ మాత్రలు ఇచ్చాడు. ఆ మాత్రలు వేసుకున్న అనంతరం యువతి తీవ్ర అస్వస్థతకు గురైంది. పరిస్థితి విషమించడంతో ఆగస్టు 26న నిజాంపేట్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి
ఆగస్టు 27న యువతి మామ కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు కాగా, దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు నిందితుడైన నాగసాయిని సెప్టెంబర్ 9న అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.ప్రైవేట్ ఆస్పత్రిలో ఖర్చులు ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు సెప్టెంబర్ 1న ఆమెను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు తీవ్రంగా శ్రమించినప్పటికీ, పరిస్థితి మెరుగుపడక సెప్టెంబర్ 14న ఆమె మృతి చెందింది. కాకినాడ ఆస్పత్రి వర్గాల సమాచారంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ మాత్రలను ఎవరి వైద్యుల సూచనతో కొనుగోలు చేశారు, వాటివల్లే మృతి చెందిందా లేదా ఇతర వైద్యపరమైన సమస్యలు ఏమైనా తలెత్తాయా అనే కోణంలో మెడికల్ రిపోర్టుల ఆధారంగా పోలీసులు విచారణ జరుపుతున్నారు.

