Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అబ్బా అనిపిస్తున్న రకుల్.. !!

అబ్బా అనిపిస్తున్న రకుల్.. !!

వార్త 2 weeks ago

టాలీవుడ్, బాలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె నటిస్తున్న తాజా హిందీ చిత్రం 'పతి పత్నీ ఔర్ ఓ దో' (Pati Patni Aur Woh 2) నుంచి తాజాగా 'అంగ' (Anga) అనే సాంగ్ గ్లింప్స్ విడుదలైంది.

ఈ పాటలో రకుల్ తన మునుపెన్నడూ లేని విధంగా అత్యంత బోల్డ్ లుక్‌లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ గ్లింప్స్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, “హీట్ లెవెల్స్ పెరగనున్నాయి” అంటూ ఆమె ఇచ్చిన క్యాప్షన్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Read Also : బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ.. మాస్ సాంగ్‌తో రచ్చ

చాలా కాలం తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ పూర్తి స్థాయి గ్లామరస్ పాత్రలో మెరవబోతున్నట్లు ఈ సాంగ్ గ్లింప్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఇందులో ఆమె తన గ్లామర్‌తో కుర్రకారుకు చెమటలు పట్టిస్తోంది. ఈ వీడియోను మేకర్స్‌తో పాటు రకుల్ తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా, నిమిషాల వ్యవధిలోనే వేలల్లో వ్యూస్, లైకులు వచ్చి చేరాయి. పెళ్లైన తర్వాత కూడా రకుల్ తన ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, వెండితెరపై తన మార్క్ గ్లామర్‌ను ప్రదర్శించడంలో ఎక్కడా తగ్గనని ఈ పాటతో నిరూపించారు.

ఆయుష్మాన్ సరసన ముగ్గురు భామలు

కామెడీ మరియు రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ వెర్సటైల్ నటుడు ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్‌తో పాటు సారా అలీ ఖాన్, వామికా గబ్బి వంటి క్రేజీ హీరోయిన్లు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముగ్గురు స్టార్ హీరోయిన్లు ఒకే సినిమాలో నటిస్తుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆయుష్మాన్ మార్క్ హ్యూమర్ తో పాటు ఈ ముగ్గురు భామల గ్లామర్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha