Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ.. మాస్ సాంగ్‌తో రచ్చ

బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ.. మాస్ సాంగ్‌తో రచ్చ

వార్త 2 weeks ago

Balakrishna new movie Update: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న #NBK111 చిత్రంపై అంచనాలు పెరుగుతున్నాయి.

‘వీరసింహారెడ్డి’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరూ మళ్లీ జతకట్టడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ ఫ్యాన్స్‌లో జోష్ నింపుతోంది. ఈ చిత్రంలోని ఒక స్పెషల్ సాంగ్ కోసం బాలీవుడ్ భామ నర్గీస్ ఫఖ్రీని ఎంపిక చేసినట్లు సమాచారం.

Read Also : Ashu Reddy Case:రూ. 9.35 కోట్ల మోసం కేసులో పోలీసుల నోటీసులు!

 Bollywood diva Nargis Fakhri in #NBK111!

Balakrishna new movie Update: నేటి నుంచే భారీ సెట్‌లో షూటింగ్ ప్రారంభం

ఈ స్పెషల్ సాంగ్ షూటింగ్ కోసం హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ స్టూడియోలో చిత్ర బృందం అత్యంత ఖరీదైన, భారీ సెట్‌ను నిర్మించింది. సమాచారం ప్రకారం, ఈ రోజు (మే 8) నుంచే ఈ పాట చిత్రీకరణ ప్రారంభం కానుంది. ‘రాక్ స్టార్’ సినిమాతో పాపులర్ అయిన నర్గీస్, బాలయ్య ఎనర్జీకి తోడైతే స్క్రీన్ పై గ్లామర్ అండ్ మాస్ విజువల్స్ అదిరిపోతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

ఈ సినిమా కోసం మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఒక పక్కా మాస్ ట్యూన్‌ను సిద్ధం చేసినట్లు టాక్. బాలయ్య తనదైన సిగ్నేచర్ స్టెప్పులతో అదరగొట్టనున్నారట. కేవలం పాటలే కాకుండా, ఈ సినిమాలో బాలయ్యను గోపీచంద్ మునుపెన్నడూ లేని విధంగా ఒక పవర్‌ఫుల్ మాస్ యాక్షన్ అవతారంలో చూపించబోతున్నారని తెలుస్తోంది. బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫఖ్రీ ఈ సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతుండటం విశేషం. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు తగినట్లుగా గోపీచంద్ మలినేని ఈ పాటను, సీన్లను డిజైన్ చేశారట.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also :

గోదారి గట్టుపైన మూవీ రివ్యూ

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha