Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అభిమాని కోరిక తీర్చిన ఉపముఖ్యమంత్రి!

అభిమాని కోరిక తీర్చిన ఉపముఖ్యమంత్రి!

వార్త 2 weeks ago

Pawan Kalyan Meets Niranjan: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన అభిమాని కోరికను నెరవేర్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.

హనుమకొండలోని హనుమాన్‌నగర్‌కు వెళ్లి అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న బాలుడు నిరంజన్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ భావోద్వేగ వాతావరణం నెలకొంది.

Read also: Tamil Nadu CM Vijay: 14 లక్షల మంది రైతులకు రూ. 75,000 రుణమాఫీ!

అభిమాని కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్

హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీ రోడ్డుకు సమీపంలోని హనుమాన్‌నగర్‌లో నివసిస్తున్న పొనుగొటి రామగోపాలచారి, మానస దంపతుల కుమారుడు నిరంజన్ గత కొంతకాలంగా డుచెన్ మస్క్యులర్ డిస్ట్రోఫీ (DMD) అనే అరుదైన జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ వ్యాధి కారణంగా అతడు క్రమంగా శారీరక శక్తిని కోల్పోయి ప్రస్తుతం పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు.

పవన్ కల్యాణ్‌పై అపారమైన అభిమానం కలిగిన నిరంజన్, ఒకసారి అయినా ఆయనను ప్రత్యక్షంగా కలవాలని చాలా కాలంగా కోరుకుంటున్నాడు. ఈ విషయం అభిమానుల ద్వారా పవన్ కల్యాణ్ దృష్టికి చేరడంతో ఆయన వెంటనే స్పందించి నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.

 Happiness over Pawan Kalyan’s visit to offer condolences

బాలుడిని ఆప్యాయంగా పలకరించిన పవన్ కల్యాణ్, అతని ఆరోగ్య పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. నిరంజన్‌తో కొంతసేపు ముచ్చటించి ధైర్యం చెప్పారు. తన అభిమాన నాయకుడిని దగ్గరగా చూసిన నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ దృశ్యం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేసింది.

 Pawan Kalyan Meets Niranjan

పవన్ కల్యాణ్ రాకతో హనుమాన్‌నగర్ ప్రాంతంలో అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానికులు కూడా ఆయనను చూసేందుకు భారీగా గుమికూడగా, పోలీసులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసి బందోబస్తు నిర్వహించారు.నిరంజన్‌ను పరామర్శించిన అనంతరం పవన్ కల్యాణ్ హనుమకొండలోని భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Epaper: epaper.vaartha.com

హోంమంత్రి అనితపై వ్యాఖ్యల కలకలం.. గుడివాడ అమర్నాథ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha