Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హోంమంత్రి అనితపై వ్యాఖ్యల కలకలం.. గుడివాడ అమర్నాథ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు!

హోంమంత్రి అనితపై వ్యాఖ్యల కలకలం.. గుడివాడ అమర్నాథ్‌పై పోలీస్ స్టేషన్‌లో కేసు!

వార్త 2 weeks ago

Gudivada Amarnath Allegations: ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై వైఎస్సార్‌సీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ పల్నాడు జిల్లా నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగం ‘తెలుగు మహిళ’ నేతలు అధికారికంగా ఫిర్యాదు చేశారు. మహిళా హోంమంత్రిని ఉద్దేశించి బాధ్యతారహితంగా మాట్లాడిన అమర్నాథ్‌పై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

Read Also:Pralhad Joshi Vijayawada Visit: నేడు విజయవాడకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

పోలీస్ స్టేషన్‌లో 'తెలుగు మహిళ' నిరసన - ఫిర్యాదు

ఇటీవల ఓ మీడియా సమావేశంలో గుడివాడ అమర్నాథ్ హోంమంత్రి అనితను టార్గెట్ చేస్తూ చేసిన కొన్ని వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్తంగా తెలుగు మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ఒక మహిళా హోంమంత్రిని కించపరిచేలా, ఆమె వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాజీ మంత్రి మాట్లాడటం ఆయన సంస్కారహీనతకు నిదర్శనమని తెలుగు మహిళా ప్రతినిధులు మండిపడ్డారు. నరసరావుపేట వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు భారీ సంఖ్యలో చేరుకున్న మహిళా నాయకురాళ్లు.. గుడివాడ అమర్నాథ్‌పై తక్షణమే కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని కోరుతూ ఎస్హెచ్ఓ (SHO) కు ఫిర్యాదు ప్రతిని అందజేశారు.

Gudivada Amarnath Allegations: మహిళలను గౌరవించడం చేతకాదా? - నేతల ధ్వజం

ఫిర్యాదు అనంతరం మీడియా ప్రతినిధులతో తెలుగు మహిళా నేతలు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ హయాంలోనూ మహిళా నేతలపై ఇష్టానుసారంగా మాట్లాడటం వైఎస్సార్‌సీపీ నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. అధికారంలో లేకపోయినా వారి ధోరణి మారలేదని, హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తక్షణమే గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా ప్రజాప్రతినిధులపై ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Epaper: epaper.vaartha.com

అమర్నాథ్‌పై పవన్ కళ్యాణ్ సీరియస్!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha