Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అభివృద్ధే అమిలినేని సురేంద్రబాబు అజెండా: టీడీపీ నేతలు!

అభివృద్ధే అమిలినేని సురేంద్రబాబు అజెండా: టీడీపీ నేతలు!

వార్త 3 days ago

MLA Amilineni Surendrababu: అత్యంత వెనుకబడిన కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని ఒక 'శ్రీమంతుడి' లాగా దత్తత తీసుకుని, కేవలం ప్రగతి అజెండాతో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు కోట్లాది రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంటే..

ప్రత్యర్థులు ఆ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్నారని తెలుగుదేశం పార్టీ (TDP) శ్రేణులు ఘాటుగా విమర్శించాయి. రాజకీయంగా ఎమ్మెల్యేను అభాసుపాలు చేయాలనే ఏకైక కుట్రతోనే వైఎస్సార్‌సీపీ అసత్య ఆరోపణలకు తెరలేపిందని మండిపడ్డాయి. బుధవారం కళ్యాణదుర్గం స్థానిక ప్రజా వేదిక భవనంలో టిడిపి ముఖ్య నాయకులు ఉమ్మడి మీడియా సమావేశం నిర్వహించారు.

Read Also: Pawan Kalyan First Name : పవన్ కళ్యాణ్ కు ఆ పేరు ఎలా పెట్టారో తెలుసా ?

ఈ సందర్భంగా వాల్మీకి ఫెడరేషన్ రాష్ట్ర డైరెక్టర్ వై.పి. రమేష్, కురుబ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ నీలస్వామి తదితరులు మాట్లాడుతూ.. మంగళవారం వైసీపి కార్యాలయంలో ఆ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గంలో మద్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారని, ప్రతి బాటిల్‌పైన రూ. 30 నుండి రూ. 60 దాకా అదనంగా వసూలు చేస్తున్నారంటూ ఆ నెపాన్ని ఎమ్మెల్యే సురేంద్రబాబుకు ఆపాదించేందుకు తలారి రంగయ్య సిగ్గుమాలిన ప్రయత్నం చేశారని ధ్వజమెత్తారు.

గర్భ శ్రీమంతునికి చిల్లర డబ్బుల ఆశ లేదు..

టిడిపి నేతలు మాట్లాడుతూ.. “తలారి రంగయ్యే స్వయంగా చాలా సందర్భాల్లో ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును గర్భ శ్రీమంతుడని సంబోధించారు. మరి అంతటి కోటీశ్వరుడైన ఉన్నత వ్యక్తికి.. ఇలాంటి మద్యం చిల్లర డబ్బులతో దానధర్మాలు లేదా రాజకీయం చేయాల్సిన అగత్యం ఏముంటుంది?” అని నిలదీశారు. మానవత్వ విలువలతో సాటి మనిషికి సహాయం చేయడమే పరమావధిగా నమ్మిన వ్యక్తి ఎమ్మెల్యే సురేంద్రబాబు అని కొనియాడారు. నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా 'తానున్నానంటూ' సొంత నిధులతో కొండంత భరోసా ఇస్తున్నారన్నారు.

ఉన్నత చదువులకు వెళ్లలేని నిరుపేద విద్యార్థులకు ఫీజులు కట్టడం, కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని అభాగ్యులకు సీఎంఆర్‌ఎఫ్ (CMRF)తో పాటు వ్యక్తిగతంగా అండగా నిలుస్తూ పేదల పెన్నిధిగా మారిన నాయకుడిని రాజకీయంగా తట్టుకోలేకే వైసీపి నేతలు ‘మద్యం భజన’ చేస్తున్నారని ఆరోపించారు. మద్యం దుకాణాల్లో నిజంగానే ఏవైనా అక్రమాలు జరిగి ఉంటే ప్రతిపక్ష హోదాలో ధర్నాలు చేసుకోవాలని, లేదా చట్టప్రకారం అధికారులకు ఫిర్యాదు చేయాలే తప్ప.. ఎమ్మెల్యేపై బురద చల్లితే జనం నమ్మే స్థితిలో లేరని హితవు పలికారు.

MLA Amilineni Surendrababu: తాగునీటి సంక్షోభానికి చెక్ - సొంత ఖర్చుతో కాలువల తవ్వకం!

ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నియోజకవర్గంలో చేపట్టిన విప్లవాత్మక అభివృద్ధి పనులను ఈ సందర్భంగా నేతలు లెక్కింపజేశారు:

  • సమ్మర్ యాక్షన్ టీం: మండుతున్న ఎండల్లో నియోజకవర్గంలో ఏ ఒక్క గ్రామంలోనూ తాగునీటి సమస్య రాకూడదని ప్రత్యేకంగా ‘సమ్మర్ యాక్షన్ టీం’ను ఏర్పాటు చేసి, ఎక్కడికక్కడ కొత్త బోర్లు వేయించి నీటి ఇబ్బందులు లేకుండా చేశారు. కళ్యాణదుర్గం చరిత్రలో మహిళలు తాగునీటి కోసం బిందెలు పట్టుకుని రోడ్డెక్కిన దాఖలాలు ఎక్కడా లేవన్నారు.
  • నాడు-నేడు పాఠశాలలకు జీవం: గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల అర్ధాంతరంగా ఆగిపోయిన స్కూళ్ల నిర్మాణాలకు నిధులు తెచ్చి జీవం పోశారు. దీనికి ‘పాలవాయి ప్రభుత్వ ఉన్నత పాఠశాల’ అభివృద్ధియే సజీవ సాక్ష్యమన్నారు. స్కూళ్లకు అదనపు తరగతి గదులు, బెంచీలు, క్రీడా సామాగ్రి, సైకిళ్లు అందించి విద్యకు పెద్దపీట వేశారు.
  • 114 చెరువులకు సాగునీరు: కళ్యాణదుర్గం కరువుకు శాశ్వత పరిష్కారం చూపాలనే సంకల్పంతో.. ప్రభుత్వ నిధుల మంజూరులో జాప్యం జరిగినా వెనకడుగు వేయకుండా.. తన సొంత కంపెనీ యంత్రాలు, ప్రతినిధుల సహకారంతో కాలువల త్రవ్వకాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. నియోజకవర్గంలోని 114 చెరువులకు సాగునీరు అందించడం పక్కా అనే నమ్మకాన్ని రైతాంగంలో కల్పించారు.
 Kalyandurg MLA Amilineni Surendrababu paying floral tributes to the statue of legendary leader NT Rama Rao at Siri Convention Hal

రాష్ట్రానికే ఆదర్శంగా కళ్యాణదుర్గంలో కొండంత ప్రగతి సాగుతుంటే.. వాటిని ప్రస్తావించకుండా, గోరంత మద్యం అమ్మకాలను పట్టుకుని ఎమ్మెల్యేకు అవినీతి అంటగట్టడం సమంజసం కాదన్నారు. అభివృద్ధిపై ప్రతిపక్షాలు ఎలాంటి మంచి సూచనలు ఇచ్చినా స్వీకరిస్తామని.. అలా కాకుండా కేవలం రాజకీయ ఉనికి కోసం అసత్య ఆరోపణలతో అడ్డుకునే ప్రయత్నం చేస్తే మాత్రం సహించేది లేదని టిడిపి శ్రేణులు గట్టిగా హెచ్చరించాయి. ఈ విలేకరుల సమావేశంలో కుందుర్పి మండల కన్వీనర్ ధనుంజయ, మహిళా నేతలు ప్రియదర్శిని, అరుణ, మండల కన్వీనర్లు టి.ఆర్. తిప్పేస్వామి, శివన్న, డిష్ మురళి తదితర ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

జిల్లా సమీక్షా కమిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha