AP Politics: వైకాపా హయాంలో రాష్ట్రంలో అభివృద్ధి పూర్తిగా స్తంభించిపోయింది. దమ్ముంటే, చేతనైతే వాస్తవాలపై మా కూటమి ప్రభుత్వంతో బహిరంగ చర్చకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు.
సోమవారం సంతబొమ్మాళి మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించిన మంత్రి అనంతరం జరిగిన సభలో వైకాపా అరాచకాలపై నిప్పులు చెరిగారు. మాజీ ముఖ్య మంత్రి జగన్ అబద్ధాల ప్రచారాలతో, కుట్రలతో రాజకీయ మనుగడ. అయితే ఆయన మాటలను ప్రజలు ఇక ఎంతమాత్రం నమ్మరని స్పష్టం చేశారు. ఐదేళ్ల జగన్ పాలన కేవలం అవినీతి, అరాచకాలు, అసత్యాలకే కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, 2019 నుంచి 2024 వరకు వైకాపా పాలనలో జరిగిన పనులపై బహిరంగ చర్చకు రావాలని జగన్ మోహన్ రెడ్డికి మంత్రి సవాల్ విసిరారు. వాస్తవాలను ప్రజల ముందుంచేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, వైకాపా నేతలు కూడా ముందుకు రావాలని కోరారు.
Read also: CM Chandrababu : ఉద్యోగులకు సీఎం చంద్రబాబు శుభవార్త.. రిటైర్మెంట్ వయసు పెంపు!
Atchannaidu Challenges Jagan on Development
AP Politics: ఉత్తరాంధ్రకు అన్ని రంగాల్లో ద్రోహం
ఉత్తరాంధ్ర ఆశయాలను, ఆకాంక్షలను వైకాపా ప్రభుత్వం పూర్తిగా అడ్డుకుందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. నిరుద్యోగులను ముంచిన డీఎస్సీ వివాదం నుంచి, ప్రాంతీయ ప్రయోజనా లకు కీలకమైన రైల్వే జోన్ వరకు ప్రతి విషయంలోనూ జగన్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని విమర్శించారు. రాష్ట్రాన్ని కేవలం అప్పుల కుప్పగా మార్చడం మినహా, వైకాపా సాధించిందేమీ లేదన్నారు. అలాగే ఉత్తరాంధ్ర ప్రజలు దశాబ్దాల ఆకాంక్ష అయిన విశాఖపట్నం రైల్వే జోన్ విషయంలో కూడా వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించిందని మంత్రి ధ్వజ మెత్తారు. అవసరమైన భూముల కేటాయింపులోనూ చిత్తశుద్ధి చూపకుండా కాలయాపన చేస్తూ ప్రాజెక్టు పురోగతిని అడ్డుకుందని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి అవకాశాలను రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టిన ప్రభుత్వం వైకాపా మాత్రమేనని విమర్శించారు. ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన వైకాపా భవిష్యత్తులో మరింత రాజకీయ ఒంటరితనాన్ని ఎదుర్కొంటుందని అన్నారు. వీటన్నిటిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ మంత్రి జగన్కు సవాల్ విసిరారు. ఇప్పటికైనా బుద్ది తెచ్చుకొని ప్రజలు ఇచ్చిన తీర్పు కు అనుగుణంగా మసలుకోవాలని మంత్రి అచ్చేనాయుడు వైకాపా నాయకులకు మంత్రి హెచ్చరించారు.
Read Also hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also:
రూ. 19 కోట్ల పన్ను బకాయిలు: ఆంధ్రా పేపర్ మిల్స్ పై పవన్ ఆగ్రహం!

