Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Actor Naresh: 'హే భగవాన్' ఈవెంట్‌లో నరేష్ ఫన్నీ కామెంట్స్

Actor Naresh: 'హే భగవాన్' ఈవెంట్‌లో నరేష్ ఫన్నీ కామెంట్స్

వార్త 4 months ago

సీనియర్ నటుడు నరేష్ (Actor Naresh) మరోసారి తన వ్యాఖ్యలతో చర్చకు దారి తీశారు. తాజాగా విడుదలకు సిద్ధమవుతున్న 'హే భగవాన్' సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మహిళల వస్త్రధారణపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడిన నరేష్, ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల ప్రభావంతోనే చాలా మంది మహిళలు ఇప్పుడు స్టేజీలపై చీరల్లోనే కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Raja Saab: ఓటీటీలో దూసుకుపోతున్న 'ప్రభాస్' సినిమా

మీరిద్దరే హగ్ చేసుకోండి

'హే భగవాన్‌' సినిమాలో సుహాస్, శివానీ నగరం జంటగా నటించారు. ఇందులో నరేష్ తో పాటుగా యాంకర్ స్రవంతి కీలక పాత్రలు పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఫిబ్రవరి 20న థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో గురువారం హైదరాబాద్‌లో ట్రైలర్ పేరుతో ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ నిర్వహించారు. దీనికి హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వాలంటైన్‌ వీక్‌లో భాగంగా ఇవాళ హ్యాపీ హగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారంటూ స్టేజ్ మీద పురుషులందరికీ హగ్ ఇచ్చిన నరేష్.. శివానీ నగరం, స్రవంతి దగ్గరకు వచ్చి ఆగిపోయారు. ''మిమ్మల్ని కూడా హగ్‌ చేద్దామనే వచ్చాను. కానీ, మీరిద్దరూ లక్షణంగా చీరలు కట్టుకొని వచ్చారు. కొన్ని సంఘటనల తర్వాత చాలామంది స్టేజుల మీద చీరలు కట్టుకునే కనిపిస్తున్నారు. భారతీయ సంస్కృతి ప్రకారం మగవాళ్లు ఆడవాళ్లని హగ్ చేసుకోకూడదు కాబట్టి, మీరిద్దరే హగ్ చేసుకోండి'' అని నరేష్ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha