Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అడవి పంది దాడి.. ముగ్గురికి గాయాలు

అడవి పంది దాడి.. ముగ్గురికి గాయాలు

వార్త 3 months ago

Tirupati News: తిరుపతి జిల్లా జీవిపురం దళితవాడలో ఘటన, తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండల పరిధిలోని అటవీ ప్రాంత సమీపం గ్రామం జీవిపురం దళితవాడలో పిల్లలు ఇంటి పరిసర ప్రాంతాలలో కూర్చుని ఉండగా ఆదివారం ఉదయం అడవి పంది మహేష్, మరో ఇద్దరు చిన్నారులపై దాడిచేసింది.

అలాగే గాజుల గ్రామానికి చెందిన మరొకరు స్కూటర్లో వెళుతున్న వ్యక్తిపై దాడి చేసి గాయపరిచినట్లు బాధితులు తల్లిదండ్రులు తెలిపారు. అనంతరం ఓబులవారిపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి చికిత్స చేయించుకున్నారు.

Read also: AP Weather update: ఏపీలో నిప్పుల కుంపటి.. 45 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు

 Wild boar attack alert Tirupati dist.

Tirupati News: భయం గుప్పిట్లో అటవీ శివారు గ్రామాలు

అడవులు పందుల, ఎలుగుబంట్లు సంచారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారని భయభ్రాంతులకు గురై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గాదిల నూకనపల్లి కొత్తపల్లి బాలిరెడ్డిపల్లి, వైకోట అటవీ శివారు గ్రామాల ప్రాంతాల ప్రజలు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఫారెస్ట్ అధికారులు చర్యలు తీసుకొని అడవి మృగాలను గ్రామంలోకి రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

డీఎస్పీ ఆఫీసు లో పాస్‌పోర్ట్ సరెండర్ చేసిన విడదల రజని!

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha