Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో నిప్పుల కుంపటి.. 45 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు

ఏపీలో నిప్పుల కుంపటి.. 45 డిగ్రీల దిశగా ఉష్ణోగ్రతలు

వార్త 1 week ago

AP Weather update: ఏపీలో ఎండలు దడపుట్టిస్తున్నాయి. వేసవి దెబ్బకు అన్ని వయస్సుల ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇళ్లలో సైతం వెచ్చటి వాతావరణం ఉంటుంది.

ఎసిలు సైతం వేసవి తాపానికి ఉపశమనం ఇవ్వని పరిస్థితి నెలకుని ఉంది. వడగాల్పులకు ఎన్టీఆర్. శ్రీకాకుళం, కృష్ణా, గుంటూరు జిల్లాలో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందినట్లు సమాచారం. రాష్ట్రంలో ఎండల తీవ్రత, వడగాలులు, ఉక్కపోత తీవ్రత పెరుగుతోందని ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు.

Read also: Telangana Rain: పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు - 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు

 Intensity of Heat in AP

AP Weather update: వారం రోజుల పాటు పరిస్థితి ఇలాగే..

వారం రోజుల పాటు ఈ పరిస్థితి కొనసాగుతుందని తెలిపారు. ఆదివారం మార్కాపురం జిల్లా కంభంలో 43.3డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైందని తెలిపారు. నంద్యాల(జి) ఆళ్లగడ్డలో 42.8, నెల్లూరు జిల్లా గూడూరులో మోపూరులో 42.2 ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడు (నందిగామ)లో 42, అనంతపురం జిల్లా తెరన్నపల్లిలో 41.9 కర్నూలు జిల్లా తోవిలో 41.5, కృష్ణా జిల్లా నందివాడ, పల్నాడు(జి) గురజాలలో 41.4 ది, ఏలూరు జిల్లా ధర్మాజీగూడెంలో 41.3 అనకాపల్లి జిల్లా దేవరాపల్లి, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 41.2 చిత్తూరుజిల్లా నగరిలో 41.1 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.

14 జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రత

28 జిల్లాలకు గాను 14 జిల్లాల పరిధిలోని 65 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు. సోమవారం విజయనగరం, పార్వతీపురం మన్యం, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండి 42 నుంచి 44.5 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యేందుకు అవకాశం ఉందని తెలిపారు. రేపు మన్యం జిల్లా సీతంపేట మండలంలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని మరో 34 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

అల్పపీడన ప్రభావం, వర్ష సూచన

మరోవైపు నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని తెలిపారు. వీటి ప్రభావంతో రేపు పార్వతీపురం మన్యం, అల్లూరి, పోలవరం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు చెట్ల కింద నిలబడకూడదని హెచ్చరించారు.

ప్రజల అవస్థలు – నిపుణుల సూచనలు

పగటిపూట ప్రయాణించేవారు టోపీలు, మాస్కులు, మహిళలైతే ముఖానికి ముసుగులు ధరిస్తున్నారు. మాస్క్లు పెట్టుకుంటున్నారు., ఇక విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు ఎండలోనే ప్రయాణిస్తున్నారు. కొందరు వేసవి నుంచి ఉపశమనం కోసం చలివేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. కొందరు కొబ్బరి బోండాలు, శీతల పానీయాల బండ్ల వద్దకు చేరుతున్నారు. ఎండాకాలంలో ఎక్కడెక్కడో పని చేసుకొని ఇంటికి వచ్చేసరికి అలసట వచ్చేస్తుంది. చిన్న చిన్న పనులకే నీరసపడిపోతుంటాం. అలవాటు ఉన్న వాళ్లు అలసట బారి నుంచి ఉపశమనం పొందడానికి టీ, కాఫీ తీసుకుంటారు. కానీ వేసవిలో వేడి పదార్థాలు పెద్దగా రుచించవు. కాస్త చల్లచల్లగా ఏవైనా పండ్ల రసాలు తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. సహజ పానీయాలైన పళ్ల రసాలను తీసుకోవడమే మంచిదని, తద్వారా శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయని, అలసట దూరమవుతుందని పలువురు నిపుణులు సూచిస్తున్నారు.

Read Also hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

అండమాన్ ను తాకిన రుతుపవనాలు

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha