Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అధికారుల కళ్లుగప్పి బాల్య వివాహం.. అసలేం జరిగిందంటే..?

అధికారుల కళ్లుగప్పి బాల్య వివాహం.. అసలేం జరిగిందంటే..?

వార్త 2 months ago

Minor Girl Wedding: జోగులాంబ గద్వాల జిల్లాలో ఐసీడీఎస్, పోలీసు అధికారుల చిన్న పొరపాటు ఒక మైనర్ బాలిక జీవితాన్ని ఇబ్బందుల్లోకి నెట్టింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవాల్సిన అధికారులు, అసలైన వధువును వదిలేసి ఆమె సోదరిని తీసుకెళ్లడంతో పెళ్లి జరిగిపోయింది.

అధికారుల కళ్లుగప్పి పెద్దలు అనుకున్నది సాధించారు.

ధరూర్ మండలానికి చెందిన ఒక యువకుడికి, గద్వాల పట్టణానికి చెందిన మైనర్ బాలికకు గత బుధవారం రాత్రి వివాహం నిశ్చయమైంది. ఈ బాల్య వివాహంపై సమాచారం అందుకున్న ఐసీడీఎస్ అధికారులు హుటాహుటిన పెళ్లి వేదిక వద్దకు చేరుకున్నారు. అయితే, అధికారులు వస్తున్నారనే విషయం ముందే తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పెళ్లి కూతురును అక్కడి నుంచి తప్పించారు.

Read Also : Telangana Census: ప్రతి ఇంటినీ లెక్కిస్తాం: జనగణన డైరెక్టర్ భారతీ హోళికేరి

Minor Girl Wedding: అధికారుల పొరపాటు.. చెల్లెలిని తీసుకెళ్లిన వైనం

పెళ్లి వేదిక వద్దకు చేరుకున్న అధికారులు అక్కడ ఉన్న వధువు సోదరిని చూసి ఆమెనే పెళ్లి కూతురు అని భ్రమపడ్డారు. కనీసం ఆధార్ కార్డులోని ఫోటోను కానీ, వివాహ పత్రికలో ఉన్న పేరును కానీ సరిపోల్చుకోకుండా, ఆ చిన్నారిని సంరక్షణ కేంద్రానికి తరలించారు. తమ చిన్న కుమార్తెను అధికారులు తీసుకెళ్తున్నా, అసలైన పెళ్లి ఆగిపోకూడదనే ఉద్దేశంతో తల్లిదండ్రులు మౌనంగా ఉండిపోయారు.

గుడిలో గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి

అధికారులు వెళ్లిన వెంటనే, పెద్దలు మైనర్ బాలికను దగ్గరలోని గుడికి తీసుకెళ్లి వివాహం జరిపించారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు విస్మయం వ్యక్తం చేశారు. అధికారుల నిర్లక్ష్యంపై సీరియస్ అయిన అడిషనల్ ఎస్పీ నేతృత్వంలో పోలీసులు గురువారం తెల్లవారుజామున వరుడి ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే వధూవరులు గ్రామం వదిలి పారిపోయారు. ప్రస్తుతం పోలీసులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read Also hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also :

పేదల సొంతింటి కల నెరవేర్చడమే కాంగ్రెస్ లక్ష్యం

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Vaartha